హోమ్ /వార్తలు /సినిమా /

Vijay Devarakonda | Kiara Advani : విజయ్ మరో ప్యాన్ ఇండియా మూవీ.. హీరోయిన్‌గా కియారా..

Vijay Devarakonda | Kiara Advani : విజయ్ మరో ప్యాన్ ఇండియా మూవీ.. హీరోయిన్‌గా కియారా..

Vijay Devarakonda Kiara Advani Photo : Twitter

Vijay Devarakonda Kiara Advani Photo : Twitter

Vijay Devarakonda | Kiara Advani : విజయ్ మరో సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత శివ నిర్వాణతో ఓ సినిమా చేస్తున్నారు విజయ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయని తెలుస్తోంది. లైగర్ మాదిరిగా ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో రానుందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కియారా అద్వానీని (Kiara Advani) తీసుకున్నట్టుగా టాక్ నడుస్తోంది.

ఇంకా చదవండి ...

    Vijay Devarakonda : టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో “లైగర్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజాగా షూటింగ్‌ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించి టీమ్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇక అది అలా ఉంటే విజయ్ మరో సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత శివ నిర్వాణతో ఓ సినిమా చేస్తున్నారు విజయ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయని తెలుస్తోంది. లైగర్ మాదిరిగా ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో రానుందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కియారా అద్వానీని (Kiara Advani) తీసుకున్నట్టుగా టాక్ నడుస్తోంది. కియారా ప్రస్తుతం తెలుగులో శంకర్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందని టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఇక లైగర్ (Liger) విషయానికి వస్తే.. ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను దాదాపు 65 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఇది అన్ని భాషలకు కలిపి అని అంటున్నారు. లైగర్ తెలుగు శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుందట.

    ఇక ఈ చిత్రం నుండి ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ అంటూ ఓ వీడియోను వదిలింది చిత్రబృందం. ఈ వీడియో మంచి ఆదరణ పొందింది. అంతేకాదు ఇండియాలోనే ఏ సినిమాకు లేని అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. 20 మిలియన్ వ్యూస్‌తో ఐదు లక్షల లైక్స్‌తో ఈ వీడియో సంచలనం సృష్టించింది. లైగర్ ఆగస్టు 25, 2022లో విడుదల కానుంది. ఇక లైగర్ కథ విషయానికి వస్తే.. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ ఫ్యామిలీ కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా మారాడనేదే కథలా కనిపిస్తోంది.

    Ananya Panday: బ్లాక్ స్కర్టులో వావ్ అనిపించిన అనన్య పాండే.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

    పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్  (Myke Tyson)‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే మైక్ టైసన్‌కు సంబంధించిన షూట్ అమెరికాలో కంప్లీట్ అయింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే (Ananya Panday )హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు.  ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్రకు బాలయ్య డబ్బింగ్ చెప్పనున్నట్టు సమాచారం. హిందీలో మైక్ టైసన్ పాత్రకు అమితాబ్, మిగతా భాషల్లో కొంచెం క్రేజ్ హీరోలతో మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పించే పనిలో ఉన్నారట పూరీ. లైగర్‌ను (Liger) ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని అన్ని ప్రధాన భాషాల్లో విడుదలకానుంది లైగర్. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

    ఇక మరోవైపు లైగర్ పూర్తి కాగానే.. పూరీ మరోసారి విజయ్‌తో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పూరీ జనగణమన పేరుతో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ హీరోగా నటించాల్సీ ఉంది. అయితే ఆ సినిమా ఏవో కారణాల వల్ల ముందుకు పోలేదు. ఇప్పుడు అదే సినిమాను పూరీ, విజయ్‌తో చేయనున్నారని అంటున్నారు. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది. ఇక్కడ విశేషం ఏమంటే.. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నారు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Tollywood news, Vijay Devarakonda

    ఉత్తమ కథలు