సెన్సార్ బోర్డ్‌తో స‌ర‌సం ఆడుతున్న‌ విజ‌య్ దేవ‌ర‌కొండ..

సినిమాల‌ను ఎలా ప్ర‌మోట్ చేసుకోవాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు తెలిసినంత‌గా మ‌రే హీరోకు తెలియ‌దు. మ‌నోడు మ‌న‌సు పెట్టాలే కానీ సినిమాలో ఏం లేక‌పోయినా కూడా కాంట్ర‌వ‌ర్సీ ప‌రుగులు తీస్తూ వ‌స్తుంది. మరోసారి ఇదే చేస్తున్నాడు విజయ్. ఈయన తాజా సినిమా "నోటా" విషయంలోనూ విజయ్ కొత్తదారిలో వెళ్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 29, 2018, 5:56 PM IST
సెన్సార్ బోర్డ్‌తో స‌ర‌సం ఆడుతున్న‌ విజ‌య్ దేవ‌ర‌కొండ..
నోటా పోస్టర్
  • Share this:
విన‌డానికి విచిత్రంగా అనిపించినా ఇదే నిజం. ఇప్పుడు విజ‌య్ చేస్తున్న ప‌నులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. కావాల‌నే ఇప్పుడు సెన్సార్ బోర్డ్‌ను క‌వ్విస్తున్నాడు ఈయ‌న‌. "అర్జున్ రెడ్డి" టైమ్‌లో హ‌నుమంత‌రావు చేసిన ప‌నికి చిల్ తాత అంటూ ర‌చ్చ చేసిన ఈయ‌న‌.. ఇప్పుడు సెన్సార్ బోర్డ్‌తోనే స‌రసాలాడేస్తున్నాడు. అయినా త‌న సినిమాల‌ను ఎలా ప్ర‌మోట్ చేసుకోవాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు తెలిసినంత‌గా మ‌రే హీరోకు తెలియ‌దు. మ‌నోడు మ‌న‌సు పెట్టాలే కానీ సినిమాలో ఏం లేక‌పోయినా కూడా కాంట్ర‌వ‌ర్సీ ప‌రుగులు తీస్తూ వ‌స్తుంది.

సెన్సార్ బోర్డ్‌తో స‌ర‌సం ఆడుతున్న‌ విజ‌య్ దేవ‌ర‌కొండ.. vijay devarakonda teasing telugu censor board..
నోటా పోస్టర్


మొన్న‌టికి మొన్న "గీత‌గోవిందం" లాంటి ఫ్యామిలీ సినిమాను కూడా "వాట్ ది ఎఫ్" అంటూ బూతు సినిమాగా మార్చేసాడు. ఆ ఒక్క పాట పుణ్య‌మా అని చాలా క్రేజ్ వ‌చ్చింది.. అలాగే విమ‌ర్శ‌లు కూడా తిన్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అయినా "అర్జున్ రెడ్డి" ఇచ్చిన మ‌త్తు క‌దా అంత ఈజీగా వ‌ద‌ల‌దు. అందుకే ఇప్పుడు మ‌రోసారి అలాంటి తెలివితేట‌లే మ‌ళ్లీ వాడేసాడు ఈ హీరో. తాజాగా ఈయ‌న న‌టించిన "నోటా" సినిమా త‌మిళ్ వ‌ర్ష‌న్‌కు క్లీన్ యు స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. దీనిపై షాక్ అవుతూ తాము ఏ వ‌స్తుందనుకున్నాం కానీ యు ఇచ్చారు అంటూ ట్వీట్ చేసాడు విజ‌య్.

సెన్సార్ బోర్డ్‌తో స‌ర‌సం ఆడుతున్న‌ విజ‌య్ దేవ‌ర‌కొండ.. vijay devarakonda teasing telugu censor board..
విజయ్ దేవరకొండ ట్వీట్
అంత‌టితో ఆగ‌కుండా నా ప్రియ‌మైన తెలుగు సెన్సార్ బోర్డ్ ఏం ఇస్తుందో తెలుసుకోడానికి ఆస‌క్తిగా వేచి చూస్తున్నానంటూ రాసుకొచ్చాడు. అంటే కావాల‌నే ఇక్క‌డి సెన్సార్ బోర్డ్‌కు క‌వ్వింపులు పంపిస్తున్నాడ‌న్న‌మాట‌. ఎలాగూ ట్రైల‌ర్‌లో ముద్దుల‌తో పాటు బూతులు కూడా ఉన్నాయి. అయినా కూడా త‌మిళ సెన్సార్ బోర్డ్ ఎందుకో కానీ క్లీన్ యు ఇచ్చింది. మ‌రి ఇప్పుడు తెలుగులో ఏం వ‌స్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. వ‌చ్చిన త‌ర్వాత విజ‌య్ రియాక్ష‌న్ ఎలా ఉంటుంద‌నేది కూడా ఆస‌క్తిక‌రంగా మారిందిప్పుడు. అక్టోబ‌ర్ 1న తెలుగు వ‌ర్ష‌న్ సెన్సార్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుంది ఈ చిత్రం.
First published: September 29, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>