ర‌ష్మిక మంద‌న్న‌తో ఫుల్‌గా ఆడుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ అండ్ టీమ్..

ఛ‌లో, గీత గోవిందం లాంటి సినిమాల‌తో తెలుగులో చాలా త్వ‌ర‌గా స్టార్ హీరోయిన్ అయిపోయింది ర‌ష్మిక మంద‌న్న. దేవ‌దాస్ ఫ్లాప్ అయినా కూడా ఈ ఎఫెక్ట్ అమ్మ‌డి కెరీర్‌పై ఇంత కూడా ప‌డ‌లేదు. ప్ర‌స్తుతం వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 5, 2019, 6:42 PM IST
ర‌ష్మిక మంద‌న్న‌తో ఫుల్‌గా ఆడుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ అండ్ టీమ్..
విజయ్ దేవరకొండ రష్మిక
  • Share this:
ఛ‌లో, గీత గోవిందం లాంటి సినిమాల‌తో తెలుగులో చాలా త్వ‌ర‌గా స్టార్ హీరోయిన్ అయిపోయింది ర‌ష్మిక మంద‌న్న. దేవ‌దాస్ ఫ్లాప్ అయినా కూడా ఈ ఎఫెక్ట్ అమ్మ‌డి కెరీర్‌పై ఇంత కూడా ప‌డ‌లేదు. ప్ర‌స్తుతం వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఎప్రిల్ 5న ఈమె పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ట్విట్ట‌ర్లో ఈమెకు శుభాకాంక్ష‌ల వెల్లువ వ‌చ్చింది. ముఖ్యంగా మైత్రి మూవీ మేక‌ర్స్, డియ‌ర్ కామ్రేడ్ టీం ఆమెను బాగా ఆట ప‌ట్టించారు. మ‌రీ ముఖ్యంగా విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌త్యేకంగా టార్గెట్ చేసాడు. ర‌ష్మిక‌తో ఈయ‌న‌కు మంచి స్నేహం ఉంది.గీత గోవిందం సినిమాలో న‌టించిన ద‌గ్గ‌ర్నుంచి ఈ ఇద్ద‌రి మ‌ధ్య సాన్నిహిత్యం ఉంది. అప్ప‌ట్లో స్టేజీపైనే ర‌ష్మిక‌ను స‌ర‌దాగా త‌న్న‌డానికి కాలెత్తి హాట్ టాపిక్ అయ్యాడు విజ‌య్. ఇక ఇప్పుడు కూడా ట్విట్ట‌ర్లో త‌న‌కు ఇష్ట‌మైన న‌టికి త‌న‌కు ఇష్ట‌మైన రీతిలో బ‌ర్త్ డే విషెస్ చెప్పాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. డియ‌ర్ కామ్రేడ్ టీజ‌ర్‌ను కొంద‌రు కుర్రాళ్లు స్పూఫ్ చేసారు. దాన్ని పోస్ట్ చేస్తూ ర‌ష్మిక‌కు శుభాకాంక్ష‌లు తెలిపాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇది చూసి ర‌ష్మిక మంద‌న్న కూడా షాక్ అయింది.ఆ త‌ర్వాత వెంట‌నే మ‌ళ్లీ విజ‌య్ దేవ‌ర‌కొండ డియ‌ర్ కామ్రేడ్ సినిమాలో ఆమె ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసి హ్యాపీ బ‌ర్త్ డే లిల్లీ అంటూ పోస్ట్ చేసాడు. ఇదంతా చూసిన అభిమానులు కూడా ఖుషీగా ఫీల‌య్యారు. డియ‌ర్ కామ్రేడ్‌తో పాటు నితిన్ భీష్మ సినిమాలో కూడా న‌టిస్తుంది ర‌ష్మిక మంద‌న్న‌. ఏదేమైనా చాలా త‌క్కువ సినిమాల‌తోనే తెలుగులో క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ‌.
Published by: Praveen Kumar Vadla
First published: April 5, 2019, 6:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading