"నోటా" ఫ్లాప్‌తో కాస్త రేస్‌లో వెనకబడ్డాడు విజయ్ దేవరకొండ. అయితే వెంటనే మళ్లీ ఫామ్‌లోకి వస్తానంటూ ధీమాగా చెబుతున్నాడు ఈ హీరో. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన నటిస్తోన్న "టాక్సీవాలా" ప్రమోషన్స్ మొదలయ్యాయి. నవంబర్ 16న విడుదల కానుంది ఈ చిత్రం. జులైలోనే రావాల్సిన ఈ చిత్రం అనుకోని కారణాలతో ఇన్ని రోజులు వాయిదా పడుతూ వస్తుంది. "గీతగోవిందం".. "నోటా"ల కోసం త్యాగాలు పూర్తైన తర్వాత ఇప్పుడు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రంలోని పాట విడుదలైంది. మాటే వినదుగా అంటూ సాగే ఈ పాటను సిధ్ శ్రీరామ్ పాడాడు. ఈ మధ్య కాలంలో ఈయన పాడిన ఇంకేం కావాలి.. ఎగిరెగిరే.. నువ్వుంటే నా జతగా.. వెళ్లిపోమాకే లాంటి పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు ఈ పాట కూడా ఇలాగే అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. కచ్చితంగా ఈ చిత్రంతో ఫామ్‌లోకి వస్తానంటున్నాడు.
రాహుల్ సంక్రీత్యన్ ఈ చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు. ఈ సినిమాకు జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్నాడు. కామెడీ కూడా ఇందులో కనిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు పాటతో సినిమాపై అంచనాలు పెరుగుతాయని భావిస్తున్నాడు విజయ్. గీతాఆర్ట్స్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. మొత్తానికి ఏం చేసినా కూడా నోటా ఫ్లాప్ మాత్రం త్వరగా మరిచిపోవాలని చూస్తున్నాడు విజయ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu aravind, Geetha govindam, Telugu Cinema, Vijay Devarakonda