Home /News /movies /

VIJAY DEVARAKONDA SUKUMAR MOVIE WILL DISCUSS THE TELANGANA PEASANT MOVEMENT HERE ARE THE DETAILS SR

Vijay-Sukumar : తెలంగాణ సాయుధ పోరాటంలో విజయ్... అదిరిన సుకుమార్ ప్లానింగ్..

విజయ్, సుకుమార్ Photo : Twitter

విజయ్, సుకుమార్ Photo : Twitter

Sukumar : సుకుమార్.. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఆర్య సినిమాతో పరిచయమై ఇక అప్పటినుండి వైవిధ్యమైన కథలతో, కథనాలతో తెలుగువారి హృదయాలను దోచుకుంటున్న క్రియేటివ్ డైరెక్టర్.

  సుకుమార్.. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఆర్య సినిమాతో పరిచయమై ఇక అప్పటినుండి వైవిధ్యమైన కథలతో, కథనాలతో తెలుగువారి హృదయాలను దోచుకుంటున్న క్రియేటివ్ డైరెక్టర్. ఆయన సినిమాలు చాలా ప్రత్యేకం. ఓ ఆర్య, జగడం, రంగస్థలం ఇలా ఏ సినిమాకు ఆ సినిమా డిఫరెంట్. ఆయన రీసెంట్ సినిమా రంగస్థలంలో కథ గ్రామీణ నేపథ్యంలో సాగుతూ.. కులం, దాని ఆధిపత్యం ఎలా ఉంటుందో చర్చిస్తూ.. నిమ్న వర్గాలు తిరగబడితే ఏం జరుగుతుందో ఎంతో కమర్షియల్‌గా చెబుతూ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇలాంటీ సామాజిక కోణం ఉన్న సినిమాలు అంత భారీ స్థాయిలో తెరకెక్కించడం తెలుగులో చాలా అరుదు. ఇలాంటివి మనం ఎక్కువుగా తమిళ్‌లో చూస్తుంటాం. ధనుష్ అసురన్ ఆ కోవలోకే వస్తుంది. రంగస్థలం సినిమా ఆయన సినీ కెరీర్‌లో మైల్ స్టోన్‌గా మిగిలిపోనుంది. ఇక ఆయన ప్రస్తుతం అల్లు అర్జున్‌తో మరో రఫ్ అండ్ రస్టిక్ ఫీల్ ఉన్న పుష్పను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా కేటగిరీలో రూపొందుతుంని.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు అధికారకంగా ప్రకటించింది చిత్రబృందం. అందులో భాగంగా తెలుగుతో పాటు మరో నాలుగు భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన హీరోయిన్‌గా చేస్తోంది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం ఇది.

  ఈ ఇద్దరీ కాంబినేషన్‌లో ఇంతకు ముందు ఆర్య, ఆర్య2 వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. రంగస్ధలం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్పలో బన్నీ రస్టిక్ అండ్ రఫ్ లుక్‌లో కనబడుతూ.. లారీ డ్రైవర్‌గా అదరగొడుతాడని తెలుస్తోంది. ఈ చిత్రం ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరుగుతుండటంతో ఈ సినిమాను చాలా వరకు కేరళ అడవుల్లో చిత్రీకరించాలనీ భావించారు దర్శక నిర్మాతలు. కానీ కరోనాతో ఆ ప్లాన్స్ అన్ని తారుమారు అయ్యాయి. ఇక ఈ సినిమా కూడా సుకుమార్ సక్సెస్ మంత్ర అయినా... రివెంజ్ ఫార్ములాతోనే  తెరకెక్కబోతుందని తెలుస్తోంది. సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే.

  అది అలా ఉంటే.. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా ఉండనుందని తెలిసిందే. ఈ చిత్రాన్ని ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్‌లో కేదార్ సలగంశెట్టి నిర్మిస్తున్నారు. ప్రొడ్యూసర్‌గా ఈయనకు ఇదే తొలి చిత్రం. ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.  ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా లెవల్లోనే తెరకెక్కిస్తున్నారు. వీళ్ల కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ఈ చిత్రం కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో నిర్మిస్తున్నట్టు  సమాచారం. అంతేకాదు ఈ సినిమా కథ గురించే ఇప్పటికే కొన్ని రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. అదేంటంటే.. తెలంగాణ సాయుధపోరాటం నేపథ్యంలో విజయ్ దేవరకొండ సుకుమార్ సినిమా ఉంటుందని సమాచారం.

  సుకుమార్ రంగస్థలం సినిమా తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం మీద ఓ సినిమా చేయాలనుకున్నాడు. ఆ సినిమాను మహేష్ హీరోగా చేయాలనీ అనుకున్నాడు. అందులో భాగంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధించిన పుస్తకాలన్నీ చదివి.. ఓ అదిరిపోయే కథను రెడీ చేసుకున్నాడు. అయితే ఏవో కారణాల వల్ల ఈ సినిమా ముందుకు సాగలేదు. దీంతో ఆయన బన్నితో సినిమాకు రెడీ అయ్యాడు. ఇక ఇన్ని రోజులకు ఆ కథను తెరకెక్కించే అవకాశం వచ్చింది. తన మనసుకు ఎంతో నచ్చిన ఆ సబ్జెక్ట్ ను ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు సుకుమార్. అల్లు అర్జున్ పుష్ప సినిమా పూర్తవ్వగానే విజయ్ దేవరకొండతో ఈ సినిమా ఉండనుంది. దీనికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Sukumar, Vijay Devarakonda

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు