బాలీవుడ్ అర్జున్ రెడ్డి భామతో విజయ్ దేవరకొండ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో బుల్లెట్‌లా వచ్చి రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండ. తాజాగా ముంబాయిలో జరిగిన ఒక సినీ వేడుకలో కియరాతో విజయ్ దేవరకొండ దిగిన సెల్ఫీ వైరల్ అవుతోంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 30, 2019, 5:23 PM IST
బాలీవుడ్ అర్జున్ రెడ్డి భామతో విజయ్ దేవరకొండ..
కియరాతో విజయ్ దేవరకొండ
  • Share this:
టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో బుల్లెట్‌లా వచ్చి రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండ. ‘పెళ్లిచూపులు’ సినిమాతో మొదటి సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో ఏ తెలుగు హీరోకు ఇంత పాపులారిటీ రాలేదని చెప్పోచ్చు.  అర్జున్ రెడ్డి తర్వాత ‘మహానటి’ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన విజయ్ దేవరకొండ..ఆ తర్వాత  పరశురామ్ దర్శత్వంలో చేసిన ‘గీతా గోవిందం’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్బులో ఎంటరయ్యాడు. రీసెంట్‌గా ‘టాక్సీవాలా’ సినిమాతో మరో సక్సెస్‌ను అందుకున్నాడు. ప్రెజెంట్ ఈ కథానాయకుడు..భరత్ కమ్మ డైరెక్షన్‌లో ‘డియర్ కామ్రెడ్’ సినిమా చేస్తున్నాడు.ఈ  సినిమాను తెలుగు,తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ ముంబైలో జరిగిన హిందూస్థాన్ టైమ్స్ ఇండియాస్ మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్ ఫంక్షన్‌లో పార్టిసిపేట్ చేసాడు. ఈ ప్రోగ్రామ్‌కు షారుఖ్ దంపతులతో పాటు అక్షయ్, రణ్‌వీర్ సింగ్,కరీనా కపూర్, కత్రినా,కియారా అద్వానీతో పలువురు నటీనటులు పాల్గొన్నారు. ఆ తర్వాత విజయ్ దేరకొండ..కియారతో ఒక ఫోటో దిగాడు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram

When Preeti met Arjun @thedeverakonda 😎


A post shared by KIARA (@kiaraaliaadvani) on


తెలుగులో ‘భరత్ అను నేను’సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కియార అద్వానీ..ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ భామ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌ ‘కబీర్ సింగ్’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ మేరకు నెటిజన్స్ అర్జున్ రెడ్డితో బాలీవుడ్ ప్రీతి అని కామెంట్స్ పెడుతున్నారు. తెలుగులో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాలో షాలినీ పాండే..ప్రీతి పాత్రలో నటించిన విషయం తెలిసిందే కదా.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 30, 2019, 5:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading