అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ ఇంకా దిగలేదా విజయ్ దేవరకొండ..?

World Famous Lover movie: మొన్నామధ్య తాను ఇంక లవ్ స్టోరీస్ చేయను.. ప్రేమకథలకు దూరంగా ఉంటానని విజయ్ దేవరకొండ చెప్పడంతో అంతా షాక్ అయ్యారు కానీ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చూసిన తర్వాత అలా ఎందుకన్నాడో అర్థమవుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 14, 2020, 3:15 PM IST
అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ ఇంకా దిగలేదా విజయ్ దేవరకొండ..?
సందీప్ రెడ్డి వంగా: అర్జున్ రెడ్డి అనే ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ సినిమాను ఊపిసన సందీప్ రెడ్డి వంగా.. ఇప్పటి వరకు మరో సినిమా చేయలేదు. ఈయనకు తెలుగు ఇండస్ట్రీ కలిసొచ్చేలా కనిపించడం లేదు.
  • Share this:
ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఇదే అడుగుతున్నారు ఈ హీరోను. ఇంకా ఎన్నాళ్లూ అదే హ్యాంగోవర్‌లో ఉంటావు.. చాలా కథలు ఉన్నాయి కదా అవి కూడా ట్రై చేయ్ అంటూ ఆయనకు సలహాలు ఇస్తున్నారు. మొన్నామధ్య తాను ఇంక లవ్ స్టోరీస్ చేయను.. ప్రేమకథలకు దూరంగా ఉంటానని విజయ్ దేవరకొండ చెప్పడంతో అంతా షాక్ అయ్యారు కానీ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చూసిన తర్వాత ఆయనెందుకు అలా అన్నాడనేది అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రేమకథలు చేయాలంటే ఓ రకంగా విజయ్ కూడా వెక్స్ అయిపోయాడేమో అనిపిస్తుంది. అందుకే అలా అన్నాడేమో అంటున్నారు అభిమానులు. ఇప్పుడు విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కూడా అర్జున్ రెడ్డి తరహా పాత్రలోనే కనిపించాడు విజయ్ దేవరకొండ.

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)


ముఖ్యంగా రాశి ఖన్నాతో వచ్చే ట్రాక్ అంతా మరోసారి శాలిని, అర్జున్ రెడ్డి ప్రేమకథను గుర్తు చేస్తుంది. ఎంత వద్దనుకున్నా కూడా ఇప్పటికీ అర్జున్ రెడ్డి ప్రభావం విజయ్ దేవరకొండపై కనిపిస్తుంది. ఆయనతో సినిమా అనగానే దర్శకులు కూడా అలాంటి కథలనే ఎక్కువగా రాస్తున్నారేమో అనిపిస్తుంది. డియర్ కామ్రేడ్ కూడా అంతే.. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ సైతం అంతే. అందుకే ఇకపై ప్రేమకథలకు దూరంగా ఉంటానని చెప్పాడు విజయ్. అర్జున్ రెడ్డి తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు సైన్ చేసాడు విజయ్. పైగా క్రాంతి మాధవ్ కూడా కథపై ఫోకస్ చేసినా కథనంపై మాత్రం అంతగా దృష్టి పెట్టలేకపోయాడు.

విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి (Vijay Devarakonda Arjun Reddy)
విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి (Vijay Devarakonda Arjun Reddy)


అందుకే కథ బాగున్నా కూడా స్క్రీన్ ప్లే మాత్రం స్లోగా సాగింది. ఒక్క శీనయ్య, సువర్ణ ఎపిసోడ్ మాత్రమే అదిరిపోయింది. సింగరేణిలో ఉండే విజయ్, ఐశ్వర్యా రాజేష్ పాత్రలపై బాగా ఫోకస్ చేసాడు క్రాంతి. ఆ తర్వాత మళ్లీ అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ వచ్చేసింది. ఏదేమైనా కూడా పూర్తిగా అలాంటి దాన్నుంచి బయటపడి మళ్లీ గీత గోవిందం లాంటి సినిమా ట్రై చేస్తే తప్ప విజయ్ కెరీర్‌కు మంచి రోజులు రానట్లే. ప్రస్తుతం చేస్తున్న ఫైటర్ పూర్తిగా పూరీ స్టైల్‌లోనే సాగనుంది. మరి ఆ తర్వాత ఏం చేస్తాడో చూడాలిక. అప్పుడైనా ప్రేమకథలకు దూరంగా ఉండి నిజంగానే అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ నుంచి బయటికి వస్తాడో లేదో చూడాలిక.
First published: February 14, 2020, 3:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading