బెడ్రూమ్‌లోనే లాక్‌డౌన్ అంతా గడిపేస్తున్న స్టార్ హీరో..

Vijay Devarakonda: లాక్ డౌన్ అంతా బెడ్రూమ్‌లోనే అంటున్నాడు.. బెడ్డుపైనే అన్నీ చేస్తున్నాడు ఆయన. బయట ప్రపంచాన్ని కూడా మరిచిపోయి బెడ్రూమ్‌కే అంకితం అయిపోయాడు ఆ హీరో.. అతనెవరో కాదు విజయ్ దేవరకొండ.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 25, 2020, 4:06 PM IST
బెడ్రూమ్‌లోనే లాక్‌డౌన్ అంతా గడిపేస్తున్న స్టార్ హీరో..
ఇదిలా ఉంటే తాజాగా ఈయన మరో సెన్సేషనల్ రికార్డు సొంతం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో విజయ్ ఫాలోయింగ్ చూసి మెంటల్ వచ్చేస్తుంది. ఇక్కడ ఈయన సరికొత్త రికార్డులకు తెర తీస్తున్నాడు. ముఖ్యంగా రౌడీ బాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చరిత్ర సృష్టించాడు.
  • Share this:
బయట పనులు లేవు.. సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి.. బోర్ కొడుతుందని అడుగు బయటపెట్టడానికి కూడా లేదు.. ఇంట్లోనే ఉండాలి.. బయటికి వెళ్తే బాగుండదు. దాంతో మన సెలబ్రిటీస్‌కు కూడా ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు ఓ హీరో అయితే లాక్ డౌన్ అంతా బెడ్రూమ్‌లోనే అంటున్నాడు. బెడ్డుపైనే అన్నీ చేస్తున్నాడు ఆయన. బయట ప్రపంచాన్ని కూడా మరిచిపోయి బెడ్రూమ్‌కే అంకితం అయిపోయాడు ఆ హీరో.. అతనెవరో కాదు విజయ్ దేవరకొండ. కొరటాల శివ విసిరిన 'బి ది రియల్ మ్యాన్' సవాల్ స్వీకరించిన విజయ్ దేవరకొండ.. చిన్నచిన్న పనులు చేసాడు.

పడుకున్న దుప్పట్లు మడత పెట్టడం.. వాటర్ బాటిల్స్ నింపి ఫ్రిజ్‌లో పెట్టడం లాంటివి చేసాడు విజయ్. తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ వీడియో తీస్తుంటే.. ఈ పనులన్నీ చేసాడు. ఇది చూసిన కొరటాల త్వరలోనే నువ్వు చిన్నపిల్లాడు కాదు ఎదిగాడు అని మీ అమ్మగారు అనుకోవాలని కోరుకున్నాడు. తన వంతుగా దుల్కర్‌ సల్మాన్‌కి 'బి ఏ రియల్ మ్యాన్' ఛాలెంజ్‌కు నామినేట్ చేశాడు విజయ్ దేవరకొండ. ఇదిలా ఉంటే సాధరణంగా తాను రోజుకి సగటున 6 గంటలు పడుకుంటే.. లాక్‌డౌన్‌ మొదలైన తర్వాత రోజుకు 9.30 గంటలు బెడ్‌పైనే ఉంటున్నానని చెప్పాడు. అన్ని గంటలు హాయిగా పడుకుంటున్నానని.. బెడ్రూమ్ వదిలి బయటికి రావాలనిపించడం లేదని చెబుతున్నాడు ఈయన.

డస్ట్‌ బిన్‌లోని చెత్తను సులువుగా తీయడానికి.. పాత కవర్లను చెత్తడబ్బాలో పేరిస్తే చెత్త తీయడం సులువు అవుతుందని చిట్కాలు కూడా ఇస్తున్నాడు విజయ్. టీవీని శుభ్రం చేసి వీడియో గేమ్‌ ఆడుతున్నాడు ఈయన. ఆ తర్వాత మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేసి తన కుటుంబ సభ్యులకి అందించాడు. మనల్ని ఇష్టపడే వాళ్లు పక్కనే ఉంటే ప్రపంచంలో అసలు బాధలు, కష్టాలు ఉండవంటున్నాడు విజయ్. లేని వాళ్ల కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పాడు ఈయన. ఏదేమైనా కూడా లాక్ డౌన్ అయ్యేంత వరకు నిద్రతోనే టైమ్ పాస్ అంటున్నాడు విజయ్. ప్రస్తుతం ఈయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా చేస్తున్నాడు.
Published by: Praveen Kumar Vadla
First published: April 25, 2020, 4:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading