news18-telugu
Updated: April 15, 2020, 12:08 PM IST
9 మిలియన్ల ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నాడు. దక్షిణాదిలో ఇన్‌స్టాలో 9 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన ఏకైక హీరోగా విజయ్ దేవరకొండ కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డు ఇది. దాంతో పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పోలీసులకు నైతిక స్థైర్యాన్ని కల్పించారు హీరో విజయ్ దేవరకొండ. తాజాగా కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అభిమానులకు మంచి బహుమతి ఇచ్చారు. ఈయన హీరోగా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాను ఈ రోజు నుంచి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రదర్శితం కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాను థియేటర్స్‌లో చూడని వాళ్లు.. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో చూడొచ్చన్న మాట. ఈ మధ్యకాలంలో సినిమావాళ్లకు థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో బాగానే వర్కౌట్ అవుతుంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్, సన్ నెక్ట్స్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వచ్చాకా.. సినిమా థియోటర్స్‌లో నడుస్తూ ఉండగానే అమెజాన్ ప్రైమ్, జీ 5, సన్ నెక్ట్స్‌లో రిలీజైతున్నాయి. ఒక రకంగా డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు బాగానే వర్కౌట్ అయినా.. డిస్ట్రిబ్యూటర్స్‌కు మాత్రం ఒక సినిమా నడుస్తుండగా ఓటీటీ ఫ్లాట్‌పామ్‌లో విడుదల కావడం ఎంతో కొంత నష్టాన్ని తెచ్చిపెడుతోంది.
కానీ ప్రస్తుతం కరోనా లాక్డౌన్ నేపథ్యంలో చాలా మంది ప్రజలు ఇంటి వద్దే ఉంటున్నారు. అంతేకాదు ఈ మధ్యకాలంలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో చూసే ప్రేక్షకులు కూడా ఎక్కువయ్యారు. అందుకే ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు రిలీజ్‌కు ముందు ఆయా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌తో ఒప్పందం చేసుకుంటున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ‘వరల్ట్ ఫేమస్ లవర్’ సినిమా ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా సన్ నెక్ట్స్తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రదర్శితమవుతుంది. వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది.
విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా నటించారు. ఓనమాలు ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. మొత్తానికి థియేటర్స్‌లో ఈ సినిమా చూడని వాళ్లు.. ఎంచక్కా ఈ రోజు నుంచి ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో చూడొచ్చన్న మాట.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
April 15, 2020, 12:08 PM IST