కీర్తి సురేష్ ఫోటోను షేర్ చేసిన విజయ్ దేవరకొండ..

కీర్తి సురేష్ 'మహానటి' సినిమాతో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. ఆ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించేసింది.

news18-telugu
Updated: December 5, 2019, 3:10 PM IST
కీర్తి సురేష్ ఫోటోను షేర్ చేసిన విజయ్ దేవరకొండ..
Instagram
  • Share this:
కీర్తి సురేష్ 'మహానటి' సినిమాతో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. ఆ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించేసింది. 'మహానటి'లో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా  అయ్యారు. దీనికి తోడు ఈ సినిమాలో కీర్తి నటనకు జాతీయ పురస్కారం కూడ లభించింది. 'మహానటి'లో కీర్తి సురేష్‌తో పాటు సమంత, విజయ్ దేవరకొండ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్‌లో కీర్తి, విజయ్‌లు తెగ సందడి చేశారు అప్పట్లో. ఇదంతా ఇప్పుడెందుకంటే.. కీర్తి, విజయ్ దేవరకొండకు చెందిన క్లాతింగ్ బ్రాండ్ రౌడీ డ్రెస్‌లో అదరగొట్టింది. అంతేకాదు ఆ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మొదట విజయ్, కీర్తి పిక్‌ను తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. దాన్ని కీర్తి రీపోస్ట్ చేసింది. ఆ పిక్‌లో కీర్తి సురేష్ సూపర్ స్టైలీష్‌గా కేక పెట్టిస్తోంది. దీంతో ఆ పిక్‌ను చూసిన ఆమె అభిమానులు ఫిదా అవుతూ.. తెగ కామెంట్స్ పెడుతున్నారు. కీర్తి అదుర్స్, కీర్తి సూపర్ అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ఈ భామ హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తోన్న ‘మైదాన్’ సినిమాలో నటిస్తోంది. దాంతో పాటు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వస్తున్న 'పెంగ్విన్' సినిమాలో మరో వైపు తెలుగులో నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా చేస్తోంది.

Instagram
Instagram


అదిరిన రాధిక ఆప్టే లేటెస్ట్ పిక్స్..
Published by: Suresh Rachamalla
First published: December 5, 2019, 3:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading