సాయం చేయలేనంటూ చేతులెత్తేసిన విజయ్ దేవరకొండ.. కారణాలు ఇవే..

తాజాగా కరోనాపై పోరాటంలో సామాన్య ప్రజలను ఆదుకోవడానికి రూ. కోటి ముప్పై లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.తాజాగా ఈ సాయంపై విజయ్ దేవరకొండ స్పందించాడు.

news18-telugu
Updated: May 1, 2020, 1:01 PM IST
సాయం చేయలేనంటూ చేతులెత్తేసిన విజయ్ దేవరకొండ.. కారణాలు ఇవే..
వరస ఫ్లాపులు వస్తున్నా కూడా విజయ్ దేవరకొండ ఇమేజ్‌కు వచ్చిన నష్టమైతే ఏం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు అలా ఉన్నాయి. ఇన్ని రోజులు చిన్న దర్శకులతో పని చేసాడు కానీ ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ ఆయన్ని వెతుక్కుంటూ వచ్చేస్తున్నారు.
  • Share this:
చేసినవి కొన్ని సినిమాలైనా.. వాటితోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. తాజాగా కరోనాపై పోరాటంలో సామాన్య ప్రజలను ఆదుకోవడానికి రూ. కోటి ముప్పై లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.  ఇలాంటి విపత్కర పరిస్థితులలో మాములు ప్రజలకు సాయం అందించడానికి రెండు ఛారిటీ సంస్థలను ఏర్పాటు చేసి తనదైన ముద్ర వేసుకున్నాడు.ఈ విపత్కర పరిస్థితుల్లో నిత్యావసరాలు లేక ఇబ్బందులు పడుతున్న వారి కోసం రూ. 25 లక్షల రూపాయలతో మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేసాడు.మిగిలిన డబ్బులతో  యూత్‌కు ఎంప్లాయిమెంట్ కోసం ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. మిడిల్ క్లాస్ ఫండ్‌లో భాగంగా ఎవరికైనా నిత్యావసరలు లేక అవస్థలు పడుతున్న వారు ఈ వెబ్‌సైట్‌లో   https://thedeverakondafoundation.org లాగిన్ అయి తమ వివరాలు నమోదు చేసుకుంటే వాళ్ల వాలంటీర్లే స్వయంగా సభ్యులకు నిత్యావసరాలు అందజేస్తున్నట్టు ప్రకటించని సంగతి తెలిసిందే కదా. రూ. 25 లక్షల విరాళంతో రెండు వేల  కుటుంబాలను ఆదుకోవాలని అనుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం పొందలేని వారు, రేషన్ కార్ట్ లేని వాళ్లకు ఈ సాయం చేస్తానని ప్రకటించాడు. కానీ ఐదు రోజుల నుంచి తమకు 77 వేలకు పైగా వినతులు వచ్చాయి. కానీ మా దగ్గర ఉన్న నిధులు అంత మందికి సరిపోవు. వచ్చని వినతుల్లో సాధ్యమైనంత వరకు సాయం చేస్తాం అన్నారు.  మా ఉద్యమం ముందుకు సాగాలంటే మరింత మంది మా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

Published by: Kiran Kumar Thanjavur
First published: May 1, 2020, 12:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading