Home /News /movies /

VIJAY DEVARAKONDA SAMANTHA RUTH PRABHU MOVIE UPDATE FIRST LOOK AND TITLE RELEASE DATE CONFIRMED SR

Vijay Devarakonda : విజయ్‌-సమంత సినిమా ఫస్ట్ లుక్‌ అండ్ టైటిల్ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్..

Samantha and Vijay Photo : Twitter

Samantha and Vijay Photo : Twitter

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సమంత (Samantha Ruth Prabhu) కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మంచి లవ్‌స్టోరీతో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఇంకా చదవండి ...
    రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సమంత (Samantha Ruth Prabhu) కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మంచి లవ్‌స్టోరీతో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రేపు మే 16న డేట్ లాక్ చేసింది టీమ్. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ తోపాటు టైటిల్ ని రేపు ఉదయం 9 గంటల 30 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాకు ఖుషి అనే టైటిల్ ఖరారు అయ్యిందిని టాక్. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కశ్మిర్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం పూరి జగన్నాధ్ (Puri Jagannadh) దర్శకత్వంలో లైగర్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అనన్యపాండే హీరోయిన్‌గా (Ananya Panday) చేస్తున్నారు. ఈ సినిమా తాజాగా షూటింగ్‌ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.

    లైగర్ (Liger) కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. ఈ సినిమాలో ఐటెమ్ నెంబర్ ఉందట. ఈ పాటలో డాన్స్ చేసేందుకు టీమ్ ఇప్పటికే చాలా మందిని పరిశీలించారట. ఈ సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ కోసం కెజియఫ్ భామ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ని సంప్రదించడమే కాదు.. ఆమె లైగర్‌‌లో సాంగ్ చేయబోతుందని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో రూమర్ వినిపిస్తోంది. ఈ స్పెషల్ సాంగ్‌లో శ్రీనిధికి బదులుగా రష్మిక మందన్న (Rashmika Mandanna) చేయబోతుందని తెలుస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో..


    ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్‌ను దాదాపు 65 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఇది అన్ని భాషలకు కలిపి అని అంటున్నారు. లైగర్  (Liger) తెలుగు శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుందని అంటున్నారు.  ఇక ఈ చిత్రం నుండి ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ అంటూ ఓ వీడియోను వదిలింది చిత్రబృందం. ఈ వీడియో మంచి ఆదరణ పొందింది. అంతేకాదు ఇండియాలోనే ఏ సినిమాకు లేని అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. 20 మిలియన్ వ్యూస్‌తో ఐదు లక్షల లైక్స్‌తో ఈ వీడియో సంచలనం సృష్టించింది. లైగర్ ఆగస్టు 25, 2022లో విడుదల కానుంది. ఇక లైగర్ కథ విషయానికి వస్తే.. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ ఫ్యామిలీ కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా మారాడనేదే కథలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు.

    Vijay and Samantha Photo : Twitter


    మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్  (Myke Tyson)‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే మైక్ టైసన్‌కు సంబంధించిన షూట్ అమెరికాలో కంప్లీట్ అయింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే (Ananya Panday )హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు.  ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. లైగర్‌ను (Liger) ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

    ఈ సినిమా అలా ఉండగానే ఆయన పూరీతో మరో సినిమాను మొదలు పెట్టారు. విజయ్.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో 'జనగణమన' (జేజీఎమ్) పేరిట మరో భారీ ప్యాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ఈ సినిమా కథ మహేష్ బాబు కోసం రాశారట. కానీ ఏవో కారణాల వల్ల ఈ సినిమా అటు తిరిగి ఇటు తిరిగి విజయ్ దగ్గరకు వచ్చింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఆగస్ట్ 3, 2023న ఈ సినిమా విడుదల కానుంది. మరోవైపు విజయ్ దేవరకొండ, దర్శకుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నారని టాక్. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందట. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. విజయ్, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Tollywood news, Vijay Devarakonda

    తదుపరి వార్తలు