VIJAY DEVARAKONDA REQUESTS FANS TO ASK CHRISTMAS GIFTS SK
క్రిస్మస్ వేళ అభిమానులకు విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్
2018 మార్చి 7న విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేసాడు. తక్కువ వ్యవధిలోనే 9 మిలియన్ల ఫాలోవర్స్‌ని సొంతం చేసుకున్నాడు.
కొందరు తమకు సెల్‌ఫోన్ కావాలని అడగ్గా.. మరికొందరు రౌడీ బ్రాండ్ టీషర్ట్ గిఫ్ట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇంకొందరైతే మీ నవ్వే మాకు పెద్ద గిఫ్ట్ అని ప్రేమ కురిపిస్తున్నారు.
యావత్ ప్రపంచమంతా క్రిస్మస్ వేడుక్లలో మునిగిపోయింది. క్రిస్మస్ పండగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటోంది. అందరిలానే టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ కూడా ఈసారి క్రిస్మస్ను ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతిసారి లాగే ఈసారి కూడా తన అభిమానులకు గిఫ్ట్స్ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. క్రిస్మస్ సందర్భంగా గిఫ్ట్స్ ఇస్తానని..ఎవరికి ఏం కావాలో కోరుకోవాలని ట్విటర్ వేదికగా అభిమానులను కోరారు విజయ్. తన నుంచి మీరేం కోరుకుంటున్నారో #DeveraSanta2019 ద్వారా తెలియజేయాలని సూచించాడు. అందరూ ఇలాగే ప్రేమ చూపించాలని.. ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ట్విటర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. విజయ దేవరకొండ ఆఫర్‌కి ట్విటర్లో పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. కొందరు తమకు సెల్‌ఫోన్ కావాలని అడగ్గా.. మరికొందరు రౌడీ బ్రాండ్ టీషర్ట్ గిఫ్ట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇంకొందరైతే మీ నవ్వే మాకు పెద్ద గిఫ్ట్ అని ప్రేమ కురిపిస్తున్నారు. అంతేకాదు క్రికెట్ కిట్, పెన్, హగ్, సినిమాలో ఛాన్స్‌లు, కెమెరా, ల్యాప్ టాప్ ఇలా చిత్రవిచిత్రంగా రౌడీని కోరికలు కోరుతున్నారు.
It's time again 😊
A tradition that I started in 2017.
క్రిస్మస్ సందర్భంగా అభిమానులకు గిఫ్ట్స్ ఇవ్వడం 2017లో ప్రారంభించారు విజయ్ దేవరకొండ. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సారి కూడా బహుమతులు ఇస్తానని చెప్పారు. కాగా, విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటిస్తున్నారు. ఐశ్వర్య రాజేశ్, ఇజబెల్లె, రాశీ ఖన్నా,కేథరిన్.. విజయ్ సరసన రొమాన్స్ చేయబోతున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాకు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా సినిమా విడుదలకు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.