రౌడీస్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) చేసే ప్రతి పనిలో ఓ కిక్కుంటుంది. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో విజయ్ తీరు తెగ అట్రాక్ట్ చేస్తుంటుంది. అందుకే బోలెడంత మంది హీరోయిన్లు విజయ్ దేవరకొండ అంటే పడి చస్తున్నారు. సారా అలీ ఖాన్ (Sara Ali Khan) లాంటి బాలీవుడ్ భామలు సైతం విజయ్‌తో రిలేషన్షిప్ కోరుకుంటున్నారు. అంతలా పాపులర్ అయిన ఈ యువ హీరో వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నాకు లైన్ వేయకు అనన్య (Ananya Panday) అంటూ ఆమెను బతిలాడుతూ కనిపిస్తున్నాడు విజయ్ దేవరకొండ. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ షోలో తన లైగర్ బ్యూటీ అనన్య పాండేతో కలిసి సందడి చేశాడు విజయ్ దేవరకొండ. దీంతో హాట్‌స్టార్‌లో ప్రసారం కాబోతున్న ఈ షోకి సంబంధించిన ప్రమో వీడియోలు వదులుతూ ఈ ఎపిసోడ్ పై ఆసక్తి పెంచేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ వీడియో వదిలారు. అనన్యతో నాకు సైట్ కొట్టకు అంటూ విజయ్ దేవరకొండ క్యూట్‌గా రిక్వెస్ట్ చేయడం ఈ వీడియోలో హైలైట్ అయింది.
ఊరికే నాకు లైన్ వేయకు అనన్య అంటూ తెలుగులో రిక్వెస్ట్ చేస్తాడు విజయ్ దేవరకొండ. ఆ వెంటనే వావ్..! చాలా బాగుంది. మళ్లీ ఒకసారి చెప్పువా అని ఆమె కోరడం, ఆ తర్వాత వీరి మధ్యలో కరణ్ వచ్చి.. తనని ఫ్లర్ట్ చేయడం ఆపమంటున్నాడు విజయ్ అని అనన్యతో చెబుతాడు. దీంతో అనన్య షాకవుతుంది. ఈ వీడియోను డిస్నీ హాట్ స్టార్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి షో పట్ల ఆసక్తి పెంచేశారు.
Hitting on each other or not, this jodi is a hit in our hearts! Watch them on the Koffee couch this Thursday! ????☕️
Episode 4 of #HotstarSpecials #KoffeeWithKaranS7, streaming from this Thursday. #KoffeeWithKaranOnHotstar pic.twitter.com/YHPJY1gqsq
— Disney+ Hotstar (@DisneyPlusHS) July 27, 2022
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది అనన్య పాండే. ఈ సినిమా కోసం యావత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఎప్పటికప్పుడు బయటకొస్తున్న కొన్ని విషయాలు ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. లైగర్ సినిమాతో ఇండియాని షేక్ చేసేయబోతున్నాం అని ముందే హింటిచ్చిన పూరి జగన్నాథ్.. అందుకు తగ్గట్లుగా సినిమాలో ఎన్నో కొత్త కోణాలు ఆవిష్కరించబోతున్నారట. ఈ సినిమాలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చూపించబోతున్నారట పూరి.
ఇప్పటిదాకా టాలీవుడ్ రౌడీ స్టార్ గా పిలిపించుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ కాబోతున్నారు. విజయ్- అనన్య స్క్రీన్ ప్రెజెన్స్ యువతకు పిచ్చెక్కించనుందట. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ (Mike Tyson) కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. రియల్ లైఫ్ బాక్సర్ అయిన ఆయన కెమెరా ముందు బాక్సింగ్ చేయబోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.