ఆ కారణాలతో.. అక్షరాల 40 కోట్ల ఆఫర్‌‌ను తిరస్కరించిన విజయ్‌..

Vijay Devarakonda : విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ క్రేజీ స్టార్.. అర్జున్ రెడ్డి సినిమాతో ఆయన తెలుగులోనే కాదు అన్ని భాష‌ల్లోనూ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు.

news18-telugu
Updated: August 5, 2019, 12:12 PM IST
ఆ కారణాలతో.. అక్షరాల 40 కోట్ల ఆఫర్‌‌ను తిరస్కరించిన విజయ్‌..
Photo : Instagram.com/thedeverakonda
  • Share this:
Vijay Devarakonda : విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడో క్రేజీ స్టార్.. అర్జున్ రెడ్డి సినిమాతో ఆయన తెలుగులోనే కాదు అన్ని భాష‌ల్లోనూ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఆయన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ ఇటీవలే నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం విడుద‌ల‌కు ముందే హిందీలో రీమేక్ చేయ‌డానికి హిందీ పాపులర్  డైరెక్ట‌ర్ క‌ర‌ణ్ జోహార్ ఆస‌క్తి చూపించిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నాడు ఈ ద‌ర్శ‌క నిర్మాత‌. అయితే కరణ్‌ జోహార్.. ఈ సినిమాతో  హీరోగా బాలీవుడ్‌కు పరిచయం చేయాలని అనుకున్నారట. అందుకే విజయ్‌కు రూ.40 కోట్లు ఆఫర్‌ చేసినట్లు సమాచారం. అయితే ‘అర్జున్‌ రెడ్డి’ దీన్ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై విజయ్‌ స్పందించాల్సి ఉంది. ఇది అలా ఉంటే.. ఇంతకు ముందు కూడా ‘అర్జున్‌ రెడ్డి’ ని హిందీలో రీమేక్‌ చేయబోతున్న సమయంలో మొదట మొయిన్ లీడ్ కోసం ముందు విజయ్‌నే సంప్రదించారు హిందీ నిర్మాతలు. అయితే విజయ్ మాత్రం ఒకసారి నటించిన పాత్రలోనే మరోసారి నటించనని.. చెబుతూ సున్నితంగా తిరస్కరించారని సమాచారం. 

View this post on Instagram
 

Arjun sends you love Preethi @kiaraaliaadvani ☺ Can't wait to see #KabirSingh!


A post shared by Vijay Deverakonda (@thedeverakonda) on

ఇదే విషయాన్ని మరోసారి విజయ్ డియర్ కామ్రేడ్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ  ఇంటర్య్వూలో స్పష్టం చేశాడు. ఆయన మాటల్లో.. ‘హిందీ సినిమాల్లో నటించాలని నాకు కూడా ఆసక్తి ఉంది. అయితే  నా సినిమా ఇటూ తెలుగుతో పాటు హిందీలోను ఒకేసారి రావాలనుకుంటున్నానని.. ఆ విధంగా ప్లాన్ చేస్తానని అన్నారు.  ఆయన మాట్లాడుతూ... ఫ్రెండ్స్, ఫ్యామిలీ హైదరాబాద్‌లో ఉండగా.. నేను అక్కడ ముంబయిలో ఓ అపార్ట్‌మెంట్‌కి మారడం ఇష్టం లేదన్నారు విజయ్.
First published: August 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు