‘డియర్ కామ్రేడ్’ సినిమా పై విజయ్ దేవరకొండ,రష్మికల రియాక్షన్ ఇది...

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. తాజాగా ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తొలిరోజే ఈసినిమా ఓవరాల్‌గా వాల్డ్ వైడ్‌గా రూ. 10 కోట్ల షేర్ వసూలు చేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఈ సినిమాపై వస్తున్న వార్తలకు తనదైన శైలిలో స్పందించాడు.

news18-telugu
Updated: July 27, 2019, 6:07 PM IST
‘డియర్ కామ్రేడ్’ సినిమా పై విజయ్ దేవరకొండ,రష్మికల రియాక్షన్ ఇది...
విజయ్ దేవరకొండ రష్మిక మందన్న
  • Share this:
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. తాజాగా ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తొలిరోజే ఈసినిమా ఓవరాల్‌గా వాల్డ్ వైడ్‌గా రూ. 10 కోట్ల షేర్ వసూలు చేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఈ సినిమాపై వస్తున్న వార్తలకు తనదైన శైలిలో స్పందించాడు. ఈ సినిమా చూడాలంటే ఎంతో ఓపిక ఉండాలి. ఇది నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. బాబీ, లిల్లీల జర్నీ ఇది. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేసిన నేనే ఈ సినిమా చూసి ఏడ్చేసాను అంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు. మరోవైపు ఈ సినిమా కొన్ని చోట్ల బోరింగ్ ఉన్న విషయాన్నికూడా ఒప్పుకున్నాడు. ఈసినిమా చేయడానికి నాకు గర్వంగా ఉందన్నారు. ఈ సినిమా పూర్తైయిన తర్వాత ఈ చిత్ర యూనిట్‌‌‌తో ఉన్న అనుబంధాన్ని మరవలేకపోతునాన్నారు. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్‌లో నేను మరో సినిమ ాచేయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి డియర్ కామ్రేడ్ సినిమా వస్తోన్న విమర్శలకు తనదైన శైలిలో స్పందించాడు. మరోవైపు ఈ సినిమా రివ్యూలు చదువుతుంటే చాలా సంతోషమేసింది. మరోవైపు ఈ సినిమాలో భాగస్వామ్యమైనందకు చాలా గర్వంగా ఉందన్నారు.

First published: July 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు