హోమ్ /వార్తలు /సినిమా /

నేనేం చిన్న‌పిల్ల‌ను కాదంటున్న ర‌ష్మిక‌.. విజ‌య్ దేవ‌రకొండ‌కు వార్నింగ్..

నేనేం చిన్న‌పిల్ల‌ను కాదంటున్న ర‌ష్మిక‌.. విజ‌య్ దేవ‌రకొండ‌కు వార్నింగ్..

డియర్ కామ్రేడ్ మూవీ స్టిల్స్

డియర్ కామ్రేడ్ మూవీ స్టిల్స్

అవునా.. ర‌ష్మిక మంద‌న్న‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ చిన్న పిల్ల అన్నాడా..? అస‌లు ఆయ‌నెందుకు అలా అన్నాడు అనుకుంటున్నారా..? ఇప్పుడు ఈ ఇద్ద‌రూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ‘గీత‌గోవిందం’ సినిమా స‌మ‌యంలోనే ఇద్ద‌రూ బెస్ట్ కెమిస్ట్రీతో పిచ్చెక్కించారు. అప్ప‌ట్నుంచి వీళ్ల స్నేహం కొన‌సాగుతుంది. ఇప్పుడు ఈ ఇద్దరూ ట్విట్టర్లో సరదాగా మాట్లాడుకున్న మాటలు వైరల్ అవుతున్నాయి.

ఇంకా చదవండి ...

అవునా.. ర‌ష్మిక మంద‌న్న‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ చిన్న పిల్ల అన్నాడా..? అస‌లు ఆయ‌నెందుకు అలా అన్నాడు అనుకుంటున్నారా..? ఇప్పుడు ఈ ఇద్ద‌రూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ‘గీత‌గోవిందం’ సినిమా స‌మ‌యంలోనే ఇద్ద‌రూ బెస్ట్ కెమిస్ట్రీతో పిచ్చెక్కించారు. అప్ప‌ట్నుంచి వీళ్ల స్నేహం కొన‌సాగుతుంది. ఇక ఇప్పుడు ‘డియ‌ర్ కామ్రేడ్’ సినిమాలోనూ క‌లిసి న‌టిస్తున్నారు. పైగా ఇప్పుడు ఇద్ద‌రి పేర్లు చెబితే గూగుల్ ఉలిక్కి ప‌డుతుంది. ఎందుకంటే 2018 టాప్ స‌ర్చ్డ్ సెలెబ్రెటీస్‌లో ఈ ఇద్ద‌రూ ఉన్నారు.

ముఖ్యంగా ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు చెబితే గూగుల్ తో పాటు బాక్సాఫీస్ రికార్డులు కూడా క‌దిలిపోతున్నాయి. 2018 మోస్ట్ స‌ర్చ్డ్ గూగుల్ జాబితాలో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా టాప్ 10లో ఉన్నాడు. ఇక ర‌ష్మిక మంద‌న్న‌కూడా అంతే. గూగుల్‌లో అత్య‌ధికంగా స‌ర్చ్ చేసిన లిస్ట్‌లో ఈమె టాప్‌లో ఉంది. ఈ విష‌యంపైనే కంగ్రాట్స్ చెబుతూ గూగుల్లో టాప్ స‌ర్చ్డ్ చైల్డ్ ఆఫ్ ది ఇయ‌ర్‌కు కంగ్రాట్స్.. టాప్ గూగుల్ స‌ర్చ్ మూవీలో హీరోయిన్.. గూగుల్ టాప్ 1, 4, 9 స్థానాల్లో ఉన్న సాంగ్స్ హీరోయిన్‌కు కంగ్రాట్స్ అంటూ క‌లిపి చెప్పాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. మ‌నం క‌లిసి పార్టీ చేసుకుందాం అంటూ ట్వీటేసాడు.

దీనికి ర‌ష్మిక స‌మాధానం ఇస్తూ నా పార్టీ ఎక్క‌డ ఫిల్మ్ ఫేర్ విన్న‌ర్.. రౌడీవేర్ ఓన‌ర్.. గూగుల్ స‌ర్చ్ లో 4వ స్థానంలో ఉన్న హీరో.. ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీ ఇస్తాన‌న్నావ్ ఎక్క‌డున్నావ్ అంటూ ట్వీట్ చేసింది. చివ‌ర్లో న‌న్ను చిన్నపిల్ల అని పిల‌వొద్దంటూ చెప్పింది. వీళ్లిద్ద‌ర్ని చూసి మైత్రి మూవీ మేక‌ర్స్ కూడా ఆగండి.. ఆగండి మా సినిమా కోసం బాగా ప‌ని చేస్తున్నారు మీ ఇద్ద‌రూ. పార్టీ త‌ప్ప‌కుండా ఉంటుంది.. అంటూ రిప్లై ఇచ్చారు.

దానికి మ‌ళ్లీ విజ‌య్ రిప్లై ఇస్తూ నేను మీకు పార్టీ ఇస్తాను క‌చ్చితంగా అన్నాడు. మొత్తానికి డియ‌ర్ కామ్రేడ్ టీం ఇప్పుడు ట్విట్ట‌ర్ ర‌చ్చ‌తో బాగానే త‌మ సినిమాను ప్ర‌మోట్ చేసుకుంటుంది. ఈ సినిమాతోనే భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. వ‌చ్చే ఏడాది మేలో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

First published:

Tags: Geetha govindam, Rashmika mandanna, Telugu Cinema, Vijay Devarakonda

ఉత్తమ కథలు