హోమ్ /వార్తలు /సినిమా /

Liger Movie Review : లైగర్ మూవీ రివ్యూ.. విజయ్ వన్ మ్యాన్ షో..

లైగర్ (Liger)
లైగర్ (Liger)
2.5/5
రిలీజ్ తేదీ:25/8/2022
దర్శకుడు : పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)
సంగీతం : సునీల్ కశ్యప్ (Sunil Kashyap)
నటీనటులు : విజయ్ దేవరకొండ,అనన్య పాండే, మైక్ టైసన్, రమ్యకృష్ణ,రోనిత్ రాయ్, విషు రెడ్డి, తదితరులు..
సినిమా శైలి : స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా
సినిమా నిడివి : 2 Hr 20 M 20 Sec

Liger Movie Review : లైగర్ మూవీ రివ్యూ.. విజయ్ వన్ మ్యాన్ షో..

LIger Review Photo : Twitter

LIger Review Photo : Twitter

Liger Movie Review : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన మూవీ ‘లైగర్’. హీరోగా విజయ్ దేవరకొండకు దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు ఇది తొలి ప్యాన్ ఇండియా మూవీ. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండకు పూరీ.. భారీ సక్సెస్‌ను అందించాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రివ్యూ : లైగర్ (Liger)
నటీనటులు : విజయ్ దేవరకొండ ,అనన్య పాండే, మైక్ టైసన్, రమ్యకృష్ణ,రోనిత్ రాయ్, విషు రెడ్డి, తదితరులు..

ఎడిటర్: జునేద్ సిద్ధిఖీ

సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ

సంగీతం: సునీల్ కశ్యప్, విక్రమ్ మాంట్రోస్, తనిష్క్ బాగ్చి, జానీ, లిజో జార్జ్, డీజే చేతస్

నిర్మాత : పూరీ జగన్నాథ్ , కరణ్ జోహార్, ఛార్మీ కౌర్,అపూర్వ మెహతా, హిరూ యశ్ జోహార్

దర్శకత్వం: పూరీ జగన్నాథ్

విడుదల తేది :25/8/2022


పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన మూవీ ‘లైగర్’. హీరోగా విజయ్ దేవరకొండకు దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు ఇది తొలి ప్యాన్ ఇండియా మూవీ. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండకు పూరీ.. భారీ సక్సెస్‌ను అందించాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..


కథ :


లైగర్ కథ విషయానికొస్తే.. లైగర్ (విజయ్ దేవరకొండ) మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కోసం కరీంనగర్ నుంచి తన తల్లి బాలమణితో (రమ్యకృష్ణ) కలిసి ముంబై వెళ్తాడు. ఇక ఆ తర్వాత నేషనల్ ఛాంపియన్ అవ్వాలని కలల్ని కంటాడు. ఈ నేపథ్యంలో కొన్ని సంఘటన అనంతరం ముంబైలో లైగర్, తాన్య (అనన్య పాండే)తో లవ్‌లో పడతాడు. ఇక నేషనల్ ఛాంపియన్ అవ్వాలన్న లైగర్ చివరకు ఛాంపియన్ అయ్యాడా.., తన లవర్ తాన్యా లైగర్ గోల్‌ను రీచ్ అవ్వడానికి ఎలా ఉపయోగపడింది.. అసలు లైగర్ తాను అనుకున్న గోల్ కి రీచ్ అయ్యాడా.. ఈ ప్రయత్నం ఎదుర్కోన్న సవాళ్లను ఎలా దాటుకుంటు వెళ్లాడు.. లైగర్‌కు అమెరికన్ బాక్సర్ మైక్ టైస‌న్ మధ్య లింక్ ఏంటీ.. అనేదే కథ.


కథనం :


విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో పక్కా యాక్షన్ ఎంటర్టైనెర్‌గా వచ్చిన లైగర్ చిత్రం యాక్షన్ సీన్స్ పరంగా బాగానే ఉన్నా.. సినిమా మాత్రం ఆసక్తికరంగా సాగలేదు. ముఖ్యంగా కథనం రొటీన్‌గా సాగడం.. కొన్ని చోట్ల సీన్స్ సిల్లీగా ఉండడం.. వంటివి సినిమా ఫలితాన్ని దెబ్బతీయోచ్చు. కథ, కథనం యావరేజ్‌గా ఉన్నా విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మొత్తంగా లైగర్ మాస్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే.. ఈ సినిమాకి వచ్చినంత హైప్, క్రేజ్ ఈ మధ్య రిలీజ్ అయిన ఏ సినిమాకు రాలేదు. అయితే అందరికి ఈ సినిమా నచ్చకపోవచ్చు.. దర్శకుడు పక్కాగా మాస్ మసాలా అంశాలతో తెరకెక్కించడంతో తెలుగు కంటే హిందీ ఆడియెన్స్‌కు బాగా ఆకట్టుకోనుంది.


నటీనటుల విషయానికొస్తే..


ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించారు. విజయ్ వన్ మ్యాన్ షో అని చెప్పోచ్చు.. మరోపక్కా హీరోయిన్’గా చేసిన అనన్యపాండే కేవలం గ్లామర్‌కు మాత్రమే పరిమితం అయ్యింది. నటనలో తెలిపోయింది. విజయ్, అనన్యల మధ్య వచ్చే కొన్ని ప్రేమ సన్నివేశాలు బాగున్నాయి. రమ్యకృష్ణ ఎప్పటిలాగే తన నటనతో వావ్ అనిపించారు. ఇతర పాత్రల్లో నటించిన అలీ, మైక్ టైసన్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.


టెక్నిషియన్స్ విషయానికొస్తే..


సినిమాటోగ్రఫర్ విష్ణు శర్మ తన కెమెరా పనితనంతో మంచి విజువల్స్ అందించారు. అలాగే సినిమాలో నేపధ్య సంగీతం కూడా బాగుంది. సినిమాను ఇంకాస్తా ట్రీమ్ చేస్తే అదిరిపోయేది. నిర్మాతలు ఎక్కడా తగ్గకుండా ఖర్చుపెట్టారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.


మైనస్ పాయింట్స్ :


దర్శకుడు మంచి స్టోరీని రాసుకున్నా.. ఆకట్టుకునే రీతిలో కథనం అల్లుకోలేకపోయాడు. పూర్తిగా మాస్‌ ప్రేక్షకులను ఉద్దేశించి రాసుకోవడంతో ఇది అందరికీ నచ్చకపోవచ్చు. అవసరం ఉన్నా లేకపోయినా బోల్డ్ నెస్ కూడిన సన్నివేశాలు రావడం.. ఇక సెకెండ్ హాఫ్2లో వచ్చే కొన్ని సన్నివేశాలు మరింత స్లోగా సాగడం.. కీలక సన్నివేశాలకు లాజిక్ మిస్ అవ్వడం. బోల్డ్ నెస్ ఎక్కువ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ కాకపోచ్చు.. మైక్ టైసన్ సీన్స్‌ను మరింత బలంగా  ఉంటే బాగుండేది.


ఫ్లస్ పాయింట్స్ :

విజయ్ యాక్టింగ్..

నిర్మాణ విలువలు..

మాస్ ఎలిమెంట్స్..


చివరి మాట : లైగర్ మాస్‌కు మాత్రమే..


రేటింగ్: 2.5




Published by:Suresh Rachamalla
First published:

రేటింగ్

కథ:
2.5/5
స్క్రీన్ ప్లే:
2/5
దర్శకత్వం:
2.5/5
సంగీతం:
2.5/5

Tags: Ananya Panday, Bollywood news, Liger Movie, Liger Movie Review, Tollywood, Vijay Devarakonda

ఉత్తమ కథలు