Vijay Devarakonda as Liger | టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ లాంటీ డిజాస్టర్ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్లో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ముందుగా ‘ ఫైటర్’ పేరు అనుకున్నారు. కానీ ఈ సినిమా టైటిల్‌తో వేరే సినిమావాళ్లు తీసుకోవడంతో ఈ సినిమాకు ప్యాన్ ఇండియా లెవల్లో ఒక టైటిల్ ఉండే విధంగా ‘లైగర్’ టైటిల్ ఖరారు చేసారు. ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్లు కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది ఈ సినిమా. లైగర్ అంటే సింహం, పులికి పుట్టిన జంతువును లైగర్ అని పిలుస్తారు. అలా హీరో క్యారెక్టర్లో పులి, సింహం ఫోటోలను బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నాయి.
విజయ్‌కు జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ముంబైతో పాటు విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. . పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. . ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. అయితే సునీల్ శెట్టి కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని టాక్. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ఖరారు చేసారు చిత్ర యూనిట్. ఈ సినిమాను సెప్టెంబర్ 9న దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
View this post on Instagram
లైగర్ కోసం ప్రత్యేకంగా వేసిన బాక్సింగ్ సెట్ లో విజయ్ దేవరకొండ పై కొన్ని ఫైట్ సీన్ షూట్ చేస్తున్నడట. మొత్తంగా ‘లైగర్’ టైటిల్ విజయ్ దేవరకొండ ఇమేజ్‌కు కరెక్ట్‌గా సరిపోతుందనే టాక్ వినబడుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం పూరీ జగన్నాథ్.. బ్యాంకాక్ వెళ్లనున్నట్టు సమాచారం. దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌కు మూడో హిందీ సినిమా.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఎప్పటినుండో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనీ అనుకుంటున్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా మంచి అవకాశం ఉండనుంది.
మరోవైపు పూరి జగన్నాథ్ కూడా ఇస్మార్ట్ శంకర్‌తో బ్లాక్ బస్టర్ అందుకుని మంచి ఫామ్‌లో ఉన్నాడు. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు భారీగా ఉన్నాయి. చూడాలి మరి ఎంతవరకూ ఆ అంచనాలను అందుకుంటుందో. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు. విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. హీరోయిన్, ఇతర టెక్నికల్ అంశాలకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, Charmy Kaur, Karan Johar, Liger Movie, Puri Jagannadh, Tollywood, Vijay Devarakonda