VIJAY DEVARAKONDA PURI JAGANNADH LIGER UPDATE MIKE TYSON COMPLETES HIS DUBBING SR
Vijay Devarakonda | Liger : లైగర్ డబ్బింగ్ పూర్తి చేసిన ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్..
Mike Tyson completes his dubbing Photo : Twitter
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం లైగర్ అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా తాజాగా షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం లైగర్ అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా తాజాగా షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. లైగర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ (Karan Johar) కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమా గురించి మరో అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రంలో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ (Mike Tyson) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆయన భారతీయ సినిమాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ సినిమాలో మైక్ టైసన్‌కి సంబంధించిన సన్నివేశాలను లాస్ ఏంజెల్స్ చిత్రబృందం చిత్రీకరించింది. అయితే తన పార్ట్‌కు మైక్ టైసన్ తాజాగా డబ్బింగ్ పూర్తి చేశారట. దీనికి సంబంధించి లైగర్ చిత్రబృందం ఓ పోస్టర్‌ను వదిలింది. మైక్ టైసన్ ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్రను పోషించారు. థాయ్‌లాండ్‌కు చెందిన కేచా స్టంట్ డైరక్షన్ చేయగా.. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) చాలా రోజుల నుంచి ఓ ప్యాన్ ఇండియా సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తుందో చూడాలి. ఈ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ ఉండనుందట. అయితే ఈ పాటలో యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier) చేయబోతుందని వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్‌ను దాదాపు 65 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఇది అన్ని భాషలకు కలిపి అని అంటున్నారు. లైగర్ (Liger) తెలుగు శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుందని అంటున్నారు. ఇక ఈ చిత్రం నుండి ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ అంటూ ఓ వీడియోను వదిలింది చిత్రబృందం. ఈ వీడియో మంచి ఆదరణ పొందింది. అంతేకాదు ఇండియాలోనే ఏ సినిమాకు లేని అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. 20 మిలియన్ వ్యూస్‌తో ఐదు లక్షల లైక్స్‌తో ఈ వీడియో సంచలనం సృష్టించింది. లైగర్ ఆగస్టు 25, 2022లో విడుదల కానుంది. ఇక లైగర్ కథ విషయానికి వస్తే.. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ ఫ్యామిలీ కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా మారాడనేదే కథలా కనిపిస్తోంది.
ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ (Myke Tyson)‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే (Ananya Panday )హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది.
ఈ సినిమా అలా ఉండగానే విజయ్.. పూరీతో మరో సినిమాను మొదలు పెట్టారు. విజయ్.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో 'జనగణమన' (జేజీఎమ్) పేరిట మరో భారీ ప్యాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ఈ సినిమా కథ మహేష్ బాబు కోసం రాశారట. కానీ ఏవో కారణాల వల్ల ఈ సినిమా అటు తిరిగి ఇటు తిరిగి విజయ్ దగ్గరకు వచ్చింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఆగస్ట్ 3, 2023న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ, దర్శకుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నారని టాక్. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందట. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. విజయ్ ప్రస్తుతం లైగర్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి త్రివిక్రమ్‌తో (Vijay Devarakonda Trivikram Srinivas movie) వచ్చే సినిమా వీటి కంటే ముందు మొదలుకానుందా.. లేకా ఈ సినిమాలు అన్ని పూర్తి అయ్యాక స్టార్ట్ కానుందా అనేది తెలియాల్సి ఉంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.