హోమ్ /వార్తలు /సినిమా /

Liger Trailer Talk : క్రాస్ బ్రీడ్ సార్ వాడు.. ఊర మాస్ డైలాగ్స్‌తో అదిరిన లైగర్ ట్రైలర్..

Liger Trailer Talk : క్రాస్ బ్రీడ్ సార్ వాడు.. ఊర మాస్ డైలాగ్స్‌తో అదిరిన లైగర్ ట్రైలర్..

Liger trailer Photo : Twitter

Liger trailer Photo : Twitter

Liger - Vijay Devarakonda | డాషింగ్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్  (Puri Jagannadh) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లెేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్‌తో పాటు పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో తాజాగా ట్రైలర్‌ను (Liger Trailer) విడుదల చేసింది టీమ్.

ఇంకా చదవండి ...

Liger - Vijay Devarakonda | రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే ప్యాన్ ఇండియా సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈరోజు ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. మంచి క్రేజ్ అంటే హైప్‌తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ 9 : 30 గంటలకు చిరంజీవి, ప్రభాస్ కూడా విడుదల చేశారు. ట్రైలర్ (Liger Trailer) విషయానికి వస్తే.. ఊరమాస్ డైలాగ్స్‌తో ఆకట్టుకుంటోంది ట్రైలర్‌లో.. క్రాస్ బ్రీడ్ సార్ వాడు.. అంటూ సాగే డైలాగ్‌తో మొదలైన.. మంచి విజువల్స్‌తో అదరగొట్టింది. దీనికి తోడు ఈ సినిమాలో విజయ్ నత్తితో సమమతమయ్యే క్యారెక్టర్ చేసినట్లు తెలుస్తోంది. చివరగా మైక్ టైసన్ డైలాగ్ కూడా బాగుంది. ఈ ప్యాన్ ఇండియా మూవీలో స్టార్ కిడ్ అనన్యపాండే హీరోయిన్‌గా (Ananya Panday) చేస్తున్నారు. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. లైగర్ (Liger) కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. ఇక ఈ సినిమాలో ఐటెమ్ నెంబర్ ఉందట.. ఈ స్పెషల్ సాంగ్‌లో రష్మిక మందన్న (Rashmika Mandanna) తన డాన్స్‌తో కేకపెట్టిస్తారని తెలుస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో..

ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్‌ను దాదాపు 85 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఇది అన్ని భాషలకు కలిపి అని అంటున్నారు. లైగర్  (Liger) తెలుగు శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుందని అంటున్నారు.  ఇక ఈ చిత్రం నుండి ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ అంటూ ఓ వీడియోను వదిలింది చిత్రబృందం. ఈ వీడియో మంచి ఆదరణ పొందింది. అంతేకాదు ఇండియాలోనే ఏ సినిమాకు లేని అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. 20 మిలియన్ వ్యూస్‌తో ఐదు లక్షల లైక్స్‌తో ఈ వీడియో సంచలనం సృష్టించింది. లైగర్ ఆగస్టు 25, 2022లో విడుదల కానుంది. ఇక లైగర్ కథ విషయానికి వస్తే.. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ ఫ్యామిలీ కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా మారాడనేదే కథ.

మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్  (Myke Tyson)‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే మైక్ టైసన్‌కు సంబంధించిన షూట్ అమెరికాలో కంప్లీట్ అయింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే (Ananya Panday )హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు.  ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. లైగర్‌ను (Liger) ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

ఈ సినిమా అలా ఉండగానే ఆయన పూరీతో మరో సినిమాను మొదలు పెట్టారు. విజయ్.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో 'జనగణమన' (జేజీఎమ్) పేరిట మరో భారీ ప్యాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ఈ సినిమా కథ మహేష్ బాబు కోసం రాశారట. కానీ ఏవో కారణాల వల్ల ఈ సినిమా అటు తిరిగి ఇటు తిరిగి విజయ్ దగ్గరకు వచ్చింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఆగస్ట్ 3, 2023న ఈ సినిమా విడుదల కానుంది. ఇక విజయ్, సమంతలు కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఖుషి అనే టైటిల్ ఖరారు అయ్యింది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ, దర్శకుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నారని టాక్. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందట. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. విజయ్, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.

First published:

Tags: Liger Movie, Vijay devarkonda

ఉత్తమ కథలు