Home /News /movies /

VIJAY DEVARAKONDA PURI JAGANNADH LIGER SHOOT TO RESUME FROM FEBRUARY IN MUMBAI HERE ARE THE DETAILS SR

Vijay Devarakonda Liger : మరోసారి షూటింగ్ లొకేషన్‌ ఛేంజ్.. ఫిబ్రవరిలో లైగర్ షూట్‌కు పూరి జగన్నాథ్ ప్లాన్..

విజయ్ లైగర్ Photo : Twitter

విజయ్ లైగర్ Photo : Twitter

Vijay Devarakonda Liger : క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో ‘లైగర్’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

    క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో ‘లైగర్’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఓ యాబై రోజుల పాటు షూటింగ్ పూర్తి చేసుకున్న లైగర్.. కరోనా కారణంగా ఆగిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడంతో సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. కానీ ఇంతవరకు ఈ సినిమా షూటింగ్ పున: ప్రారంభంకాలేదు. అయితే లాక్ డౌన్ వలన ఆగిన ఈ సినిమా చిత్రీకరణను ఇటీవలే మొదలుపెట్టాలని భావించింది చిత్రబృందం. ముంబైలో కరోనా వ్యాప్తి కాస్త ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్‌లోనే సినిమా కావాల్సిన సెట్ వేసి షూటింగ్ చేయాలని భావించారు చిత్రదర్శకనిర్మాతలు. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ నిర్ణయంలో కాస్తా మార్పులు జరిగాయని సమాచారం. అందులో భాగంగా పూరి మరోసారి నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను ముంబై సిటీలోనే షూటింగ్‌ను రెస్యూమ్ చేయాలని డిసైడ్ అయ్యాడట. ఇక ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో మొదలయ్యే సూచనలు ఉన్నాయని సమాచారం. లైగర్ కథ మొత్తం ముంబై నేపథ్యంలోనే ఉండటంతో.. అక్కడి లొకేషనల్లోనే షూట్ చేయాల్సి ఉందట. ఇక ఇటీవల విడుదలైన సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో సినిమాపై మరింత క్రేజ్ వచ్చింది.

    ఇక విజయ్ దేవరకొండ మొన్నటి వరకు సమ్మర్‌లో సత్తా చూపిస్తాడు అనుకున్నారు ఆయన ఫ్యాన్స్. అయితే తాజా సమాచారం మేరకు ఈ సమ్మర్ బరిలో విజయ్ దేవరకొండ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి ఓ కారణం కరోనా వల్ల షూటింగ్ పూర్తికాకపోవడం.. కాగ మరో కారణం ఇప్పటికే వేరే సినిమాలు విడుదల తేదీలు లాక్ చేసుకోవడం. ఈ రెండు ఈ కారణాలతో 'లైగర్' సినిమా సమ్మర్ రేసు నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఇక తాజా సమాచారం మేరకు ఈ లైగర్‌ను జులైలో ప్యాన్ ఇండియా విడుదల చేయాలనీ చూస్తున్నారట.






    లైగర్ తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే నటిస్తోంది. ఇందులో విజయ్ ఒక ఫైటర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని పూరి భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఇక తాజా సమాచారం మేరకు ఈ సినిమాను 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్  హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తోనట్లు తెలుస్తోంది. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. అయితే సునీల్ శెట్టి కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని టాక్. తెలుగు తమిళ నటి రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Puri Jagannadh, Tollywood news, Vijay Devarakonda

    తదుపరి వార్తలు