హోమ్ /వార్తలు /సినిమా /

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ ‘లైగర్’ మూవీ యూఎస్ షెడ్యూల్ కంప్లీట్..

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ ‘లైగర్’ మూవీ యూఎస్ షెడ్యూల్ కంప్లీట్..

సినిమాల్లో ఉండేదానికి పూర్తి భిన్నంగా విజయ్ బయట ఉన్నాడని.. అది నిజంగా తనకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పుకొచ్చింది అనన్య పాండే. అతడు పిరికివాడు అంటూ కామెంట్ చేసింది అనన్య. అయితే విజయ్ దేవరకొండ బెస్ట్ కో స్టార్ అంటూ కితాబిచ్చింది ఈ ముద్దుగుమ్మ. నటించే సమయంలో ఓ కోస్టార్ నుంచి ఎలాంటి కంఫర్ట్స్ కోరుకుంటామో.. అన్నీ విజయ్ దేవరకొండలో ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది.

సినిమాల్లో ఉండేదానికి పూర్తి భిన్నంగా విజయ్ బయట ఉన్నాడని.. అది నిజంగా తనకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పుకొచ్చింది అనన్య పాండే. అతడు పిరికివాడు అంటూ కామెంట్ చేసింది అనన్య. అయితే విజయ్ దేవరకొండ బెస్ట్ కో స్టార్ అంటూ కితాబిచ్చింది ఈ ముద్దుగుమ్మ. నటించే సమయంలో ఓ కోస్టార్ నుంచి ఎలాంటి కంఫర్ట్స్ కోరుకుంటామో.. అన్నీ విజయ్ దేవరకొండలో ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది.

Vijay Devarakonda - Liger - Mike Tyson - Puri Jagannadh : పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ  కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ‘లైగర్’.  బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వాల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా యూఎస్ షెడ్యూల్ కంప్లీటైంది.

ఇంకా చదవండి ...

Vijay Devarakonda - Liger - Mike Tyson - Puri Jagannadh : పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ  కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ‘లైగర్’.  బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వాల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గురువు పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్‌తో ‘లైగర్’ మూవీ క్లైమాక్స్‌ను షూట్ చేయనున్నారు. రీసెంట్‌గా యూఎస్‌లో మొదలైన ఈ సినిమా షెడ్యూల్.. తాజాగా కంప్లీటైంది.  ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు.  ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్  హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నారు. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి (Sunil Shetty)కనిపిస్తారట. అనన్య పాండే (Ananya Panday)కథానాయికగా నటిస్తోంది.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. తాజాగా బాలయ్య.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిస్తోన్న ‘లైగర్’లో ఓ ఇంపార్టెంట్ రోల్ చేయనున్నట్టు సమాచారం.రీసెంట్‌గా గోవాలో జరిగిన ఈ సినిమా షూటింగ్‌లో ఈ సినిమా యూనిట్‌ను బాలయ్య సడెన్ విజిట్ ఇచ్చి ఆశ్యర్యపరిచిన సంగతి తెలిసిందే కదా.

Chiranjeevi - Ravi Teja : చిరంజీవి, బాబీ సినిమాలో కీలక పాత్రలో రవితేజ.. త్వరలో అధికారిక ప్రకటన..

ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్రకు బాలయ్య డబ్బింగ్ చెప్పనున్నట్టు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే.. ఈ సినిమాకు అది బోనస్ అనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో బాలయ్య ఎవరు ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ కోవలో ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పినా.. ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. హిందీలో మైక్ టైసన్ పాత్రకు అమితాబ్, మిగతా భాషల్లో కొంచెం క్రేజ్ హీరోలతో మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పించే పనిలో ఉన్నారు.

NTR Jr@21 Years in TFI : హీరోగా 21 ఏళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్నఎన్టీఆర్.. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో మలుపులు..

గతంలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రామ్ చరణ్ వంటి హీరోలు వేరే హీరోలకు యానిమేటేడ్ సినిమాలకు డబ్బింగ్‌తో పాటు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ కోవలో ఇపుడు బాలయ్య కూడా మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెబుతారా లేదా అనేది చూడాలి. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.

Venkatesh : ఆర్తి అగర్వాల్ సహా వెంకటేష్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన భామలు వీళ్లే..

విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నారు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది.హీరోయిన్, ఇతర టెక్నికల్ అంశాలకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న పుష్ప సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

First published:

Tags: Ananya Panday, Bollywood news, Liger Movie, Mike Tyson, Puri Jagannadh, Tollywood, Vijay Devarakonda

ఉత్తమ కథలు