Vijay Devarakonda - Puri Jagannadh - Liger: ‘లైగర్’ మూవీకి అదిరిపోయే ఓటీటీ ఆఫర్.. ఈ విషయమై విజయ్ దేవరకొండ రెస్పాన్స్ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నాడంటే.. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ లాంటీ డిజాస్టర్ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్లో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్లో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ చిత్రానికి ‘ ఫైటర్’ టైటిల్ అనుకున్నారు. కానీ ఈ సినిమా పేరును వేరే సినిమా వాళ్లు ముందుగానే రిజిస్టర్ చేసుకోవడంతో ఈ సినిమాకు ప్యాన్ ఇండియా లెవల్లో ఒక టైటిల్ ఉండే విధంగా ‘లైగర్’ టైటిల్ ఖరారు చేసారు. ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్లు కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది ఈ సినిమా. లైగర్ అంటే సింహం, పులికి పుట్టిన జంతువును లైగర్ అని పిలుస్తారు.
తెలుగు, హిందీతో పాటు మిగతా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి రూ. 200 కోట్ల భారీ డీల్ వచ్చింది. ఈ సినిమాను నేరుగా థియేటర్స్లో కాకుండా డిజిటల్ స్ట్రీమింగ్ , శాటిలైట్ ప్రసార హక్కులకు కలిపి ఈ భారీ మొత్తం ఆఫర్ చేసినట్టు సమాచారం. ఈ భారీ డీల్ పై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు.ఈ సినిమాకు రూ. 200 కోట్ల ఓటీటీ, శాటిలైట్ డీల్ చాలా తక్కువ. థియేటర్స్లో ఈ సినిమాకు అంతకంటే ఎక్కువే వసూళు చేస్తుంది అంటూ ఓ ట్వీట్ చేసారు. దీంతో ఈ సినిమాపై దర్శకుడు పూరీకి, హీరో విజయ్ దేవరకొండకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అర్ధమవుతోంది.
Too little.
I’ll do more in the theaters. pic.twitter.com/AOoRYwmFRw
— Vijay Deverakonda (@TheDeverakonda) June 21, 2021
‘లైగర్’ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తోనట్లు తెలుస్తోంది. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. అయితే సునీల్ శెట్టి కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని టాక్. తెలుగు తమిళ నటి రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. సెప్టెంబర్ 9న విడుదల తేది ప్రకటించినా.. అదే తేదికి ఈ సినిమా విడుదలయ్యేది అనుమానమే అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ భారీగా పెండింగ్లో ఉంది.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. హీరోయిన్, ఇతర టెక్నికల్ అంశాలకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న పుష్ప సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, Charmi kaur, Karan Johar, Liger Movie, Puri Jagannadh, Tollywood, Vijay Devarakonda