VIJAY DEVARAKONDA PURI JAGANNADH LIGER FIRST GLIMPSE GETS 20 MILLION YOUTUBE VIEWS BECOMES NUMBER ONE FIRST GLIMPSE IN INDIA SR
Vijay Devarakonda | Liger : దంచికొడుతోన్న విజయ్ లైగర్ ఫస్ట్ గ్లింప్స్.. ఆల్ టైమ్ రికార్డ్..
Liger Glimpse Photo : Twitter
Vijay Devarakonda : టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో “లైగర్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
Vijay Devarakonda : టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో “లైగర్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ అంటూ ఓ వీడియోను వదిలింది చిత్రబృందం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు ఇండియాలోనే ఏ సినిమాకు లేని అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. 20 మిలియన్ వ్యూస్‌తో ఐదు లక్షల లైక్స్‌తో ఈ వీడియో సంచలనం సృష్టిస్తోంది. దీంతో టీమ్ దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేసారు. లైగర్ ఫస్ట్ గ్లింప్స్ నంబర్ వన్ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీటు, పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఆగస్టు 25, 2022లో విడుదల కానుంది. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ ఫ్యామిలీ కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియర్ అయ్యాడనేదే ఈ సినిమా కథలా కనిపిస్తోంది.
ఫస్ట్ గ్లింప్స్ విషయానికి వస్తే.. యాక్షన్ సీన్స్, పూరీ టేకింగ్ ఓ రేంజ్లో ఉన్నాయని తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. లైగర్ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన ఏడు గంటల్లో 8. 49 మిలియన్ వ్యూస్ దక్కించుకుని ఇండియాలోనే తక్కువ సమయంలో అత్యధిక వ్యూస్ పొందిన ఫస్ట్ గ్లింప్స్‌గా మరో రికార్డ్ క్రియేట్ చేసింది.
Non-stopping Rampage!
ALL-TIME RECORD !!!⚡
2️⃣0️⃣M+ Digital Views!
5️⃣0️⃣0️⃣K+ Likes! 🔥
TRENDING on YouTube! 🥁
పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ (Myke Tyson)‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే మైక్ టైసన్‌కు సంబంధించిన షూట్ అమెరికాలో కంప్లీట్ అయింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే (Ananya Panday )హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది.
ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్రకు బాలయ్య డబ్బింగ్ చెప్పనున్నట్టు సమాచారం. హిందీలో మైక్ టైసన్ పాత్రకు అమితాబ్, మిగతా భాషల్లో కొంచెం క్రేజ్ హీరోలతో మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పించే పనిలో ఉన్నారట పూరీ. లైగర్ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రూపోందుతుంది. లైగర్‌ను (Liger) ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు.
ఇక విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నారు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. హీరోయిన్, ఇతర టెక్నికల్ అంశాలకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.