Home /News /movies /

VIJAY DEVARAKONDA PURI JAGANNADH LIGER FIRST GLIMPSE CROSSES BHEEMLA NAYAK GLIMPSE BECAME MOST VIEWED GLIMPSE IN INDIA IN JUST 7HRS SR

Vijay Devarakonda | Liger : భీమ్లా నాయక్ రికార్డ్‌ను బద్దలు కొట్టిన లైగర్.. ఇండియాలో ఫస్ట్ టైమ్..

Vijay Devarakonda : టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో “లైగర్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

    Vijay Devarakonda : టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో “లైగర్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్  (Myke Tyson)‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే మైక్ టైసన్‌కు సంబంధించిన షూట్ అమెరికాలో కంప్లీట్ అయింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే (Ananya Panday )హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు.  ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 25, 2022లో విడుదల చేసింది. దీంతో ఈ సినిమా అప్పుడే ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసింది. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ ఫ్యామిలీ కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియర్ అయ్యాడనేదే ఈ సినిమా కథలా కనిపిస్తోంది.

    ఫస్ట్ గ్లింప్స్‌లో యాక్షన్ సీన్స్, పూరీ టేకింగ్ ఓ రేంజ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. దీంతో ఈ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతూ.. ఎనిమిది మిలియన్ వ్యూస్‌ను దక్కించుకుంది. దీంతో టీమ్ దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.  ఇక్కడ మరో విషయం ఏమంటే లైగర్ ఫస్ట్ గ్లింప్స్ ఏడు గంటల్లో 8. 49 మిలియన్ వ్యూస్ దక్కించుకుని ఇండియాలోనే తక్కువ సమయంలో అత్యధిక వ్యూస్ పొందిన ఫస్ట్ గ్లింప్స్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ రికార్డ్‌ను బద్దలు కొట్టింది.  ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. అందులో భాగంగా మొన్నటి వరకు అమెరికాలోని లాస్ వేగాస్‌, లాస్ ఏంజెల్స్‌‌లో షూటింగ్‌ను జరుపుకుంది టీమ్. లైగర్‌లో హిందీ నటి అనన్యపాండే (Ananya Panday) హీరోయిన్‌గా నటిస్తున్నారు.





    ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ సిల్వర్ స్క్రీన్ పై మెరువబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మైక్ టైసన్ పాత్రకు బాలయ్య డబ్బింగ్ చెప్పనున్నట్టు సమాచారం. హిందీలో మైక్ టైసన్ పాత్రకు అమితాబ్, మిగతా భాషల్లో కొంచెం క్రేజ్ హీరోలతో మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పించే పనిలో ఉన్నారు. లైగర్ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రూపోందుతుంది. లైగర్‌ను (Liger) ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది.

    Acharya | Chiranjeevi : ఆచార్య నుంచి అదిరిపోయే మాస్ సాంగ్‌.. ముహూర్తం ఫిక్స్...

    ఈ సినిమాను 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. ఇక విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నారు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. హీరోయిన్, ఇతర టెక్నికల్ అంశాలకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Liger Movie, Puri Jagannadh, Tollywood news, Vijay Devarakonda

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు