ఇస్మార్ట్ శంకర్ లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఒక పాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు ‘లైగర్’గా చిత్రబృందం టైటిల్లు ఖారారు చేసింది. ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్లు కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది ఈ సినిమా. ఫైటర్‌లో విజయ్‌కు జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే నటిస్తోంది. ఇందులో విజయ్ ఒక ఫైటర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని పూరి భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఇక తాజా సమాచారం మేరకు ఈ సినిమాను 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను త్వరలోనే షూటింగ్‌ను పున: ప్రారంభించనుంది చిత్రబృందం.ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్లో భాగంగా ఇప్పటికే ముంబైలో 40 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తోనట్లు తెలుస్తోంది. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. అయితే సునీల్ శెట్టి కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని టాక్. తెలుగు తమిళ నటి రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది.
ఇక ఈ చిత్రం షూటింగును త్వరలోనే విదేశాలలో జరుపనున్నారని సమాచారం. ఈ సినిమా దర్శకుడు పూరి తన ఫేవరైట్ కంట్రీ బ్యాంకాక్ లో ఈ సినిమా షూటింగ్’ను నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాడట. దాని కంటే ముందు.. హైదరాబాద్ లో నిర్మించిన ఓ సెట్లో ఈ సినిమా షూటింగ్ రిస్టార్ట్ కానుందని తెలుస్తోంది.
ఫైటర్ కోసం ప్రత్యేకంగా వేసిన బాక్సింగ్ సెట్ లో విజయ్ దేవరకొండ పై కొన్ని ఫైట్ సీన్ షూట్ చేస్తారట. అయితే కరోనా కారణంగా ఏర్పడ్డ ఈ గ్యాప్’ను పూర్తి చేయడానికి పూరి ఇక ఏకధాటిగా షూటింగ్‌ను నిర్వహించనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు. విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. హీరోయిన్, ఇతర టెక్నికల్ అంశాలకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న పుష్ప సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
Published by:Suresh Rachamalla
First published:January 19, 2021, 06:59 IST