Home /News /movies /

VIJAY DEVARAKONDA PURI JAGANNADH JANA GANA MANA TEAM MEETS DEFENCE MINISTER RAJNATH SINGH PICS GOES VIRAL SR

Vijay Devarakonda | JGM: కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కలిసిన విజయ్ దేవరకొండ JGM టీమ్...

Jana Gana Mana team meets Defence minister Rajnath singh Photo : Twitter

Jana Gana Mana team meets Defence minister Rajnath singh Photo : Twitter

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం లైగర్ అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా అలా ఉండగానే ఆయన పూరీతో మరో సినిమాను మొదలు పెట్టారు. విజయ్.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో 'జనగణమన' (జేజీఎమ్) పేరిట మరో భారీ ప్యాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...
    Vijay Devarakonda : విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం లైగర్ అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా అలా ఉండగానే ఆయన పూరీతో మరో సినిమాను మొదలు పెట్టారు. విజయ్.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో 'జనగణమన' (జేజీఎమ్) పేరిట మరో భారీ ప్యాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అది అలా ఉంటే ఈ చిత్రబృందం ఢిల్లీలో ప్రత్యక్షమైంది. JGM టీమ్ కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో భేటీ అయ్యింది. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాతలు చార్మీ కౌర్, జూపల్లి రాము రావు రాజ్ నాథ్ సింగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆర్మీ నేపథ్యంలో వస్తోన్న తమ చిత్రం 'జనగణమన' (Jana Gana Mana) విశేషాలను మంత్రి రాజ్ నాథ్ కు వివరించారని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి కొన్ని ఫోటోలను చార్మీ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ఈ సినిమా కథ మహేష్ బాబు కోసం రాశారట. కానీ ఏవో కారణాల వల్ల ఈ సినిమా అటు తిరిగి ఇటు తిరిగి విజయ్ దగ్గరకు వచ్చింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఆగస్ట్ 3, 2023న ఈ సినిమా విడుదల కానుంది.

    ఇక విజయ్ నటిస్తున్న లైగర్ (Liger) విషయానికి వస్తే.. ఈ సినిమా తాజాగా షూటింగ్‌ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించి టీమ్ ఓ ప్రకటనను విడుదల చేసింది. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. లైగర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. ఇక విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)  చాలా రోజుల నుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తుందో చూడాలి. ఈ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ ఉండనుందట. అయితే ఈ పాటలో యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier)  చేయబోతుందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి త్వరలో అధికారిక సమాచారం వెలువడనుంది.


    ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్‌ను దాదాపు 65 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఇది అన్ని భాషలకు కలిపి అని అంటున్నారు. లైగర్  (Liger)  తెలుగు శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుందని అంటున్నారు.  ఇక ఈ చిత్రం నుండి ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ అంటూ ఓ వీడియోను వదిలింది చిత్రబృందం. ఈ వీడియో మంచి ఆదరణ పొందింది. అంతేకాదు ఇండియాలోనే ఏ సినిమాకు లేని అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. 20 మిలియన్ వ్యూస్‌తో ఐదు లక్షల లైక్స్‌తో ఈ వీడియో సంచలనం సృష్టించింది. లైగర్ ఆగస్టు 25, 2022లో విడుదల కానుంది. ఇక లైగర్ కథ విషయానికి వస్తే.. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ ఫ్యామిలీ కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా మారాడనేదే కథలా కనిపిస్తోంది.


    ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్  (Myke Tyson)‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే మైక్ టైసన్‌కు సంబంధించిన షూట్ అమెరికాలో కంప్లీట్ అయింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే (Ananya Panday )హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు.  ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్రకు బాలయ్య డబ్బింగ్ చెప్పనున్నట్టు సమాచారం. హిందీలో మైక్ టైసన్ పాత్రకు అమితాబ్, మిగతా భాషల్లో కొంచెం క్రేజ్ హీరోలతో మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పించే పనిలో ఉన్నారట పూరీ. లైగర్‌ను (Liger) ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

    ఇక అది అలా ఉంటే విజయ్ దేవరకొండ, దర్శకుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నారని టాక్. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందట. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. విజయ్ ప్రస్తుతం లైగర్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి త్రివిక్రమ్‌తో (Vijay Devarakonda Trivikram Srinivas movie)  వచ్చే సినిమా వీటి కంటే ముందు మొదలుకానుందా.. లేకా ఈ సినిమాలు అన్ని పూర్తి అయ్యాక స్టార్ట్ కానుందా అనేది తెలియాల్సి ఉంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Puri Jagannadh, Tollywood news, Vijay Devarakonda

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు