Vijay Devarakonda : షూటింగ్‌కు రెడీ అవుతున్న ఫైటర్.. దసరా తర్వాత స్టార్ట్..

Vijay Devarakonda : టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ లాంటీ డిజాస్టర్ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: October 24, 2020, 8:07 AM IST
Vijay Devarakonda : షూటింగ్‌కు రెడీ అవుతున్న ఫైటర్.. దసరా తర్వాత స్టార్ట్..
ఫైటర్ టీమ్ Photo : Twitter
  • Share this:
టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ లాంటీ డిజాస్టర్ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఫైటర్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్‌లో వస్తోంది. ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది ఈ సినిమా. ఫైటర్‌లో విజయ్‌కు జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో భాగంగా ముంబైలో 40 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకుంది. అయితే ఆ తర్వాత షెడ్యూల్ కూడా ముంబైలోని ధారవిలో జరగాల్సీవుండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. అంతేకాదు ప్రస్తుతం పరిస్థితులు కొంత సర్దుకున్న అక్కడ షూటింగ్ జరుపుకునే అవకాశం లేదు. దీంతో ఆ ప్రణాళికను చిత్రబృందం మార్చుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్న నగరాలలో ముంబై ఒకటి. లాక్ డౌన్ ముగిసినప్పటికీ అక్కడ షూటింగ్ చేయడం శ్రేయస్కరం కాదని భావిస్తుందట చిత్రబృందం. ఇక ఈ సినిమా దసరా తర్వాత తదుపరి షూటింగును బ్యాంకాక్ లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలావుంచితే, గత కొన్నాళ్లుగా యూరప్ లో హాలిడే ఎంజాయ్ చేసిన హీరో విజయ్ దేవరకొండ ఇటీవలే హైదరాబాదు చేరుకున్నాడు. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్  హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తోనట్లు తెలుస్తోంది. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. అయితే సునీల్ శెట్టి కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని టాక్.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఎప్పటినుండో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనీ అనుకుంటున్న విజయ్‌కు ఈ సినిమా మంచి అవకాశం ఉండనుంది. మరోవైపు పూరి కూడా ఇస్మార్ట్ శంకర్‌తో బ్లాక్ బస్టర్ అందుకుని మంచి ఫామ్‌లో ఉన్నాడు. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. చూడాలి మరి ఎంతవరకూ ఆ అంచనాలను అందుకుంటుందో. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు. విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది.
Published by: Suresh Rachamalla
First published: October 24, 2020, 8:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading