విజయ్ సరసన జాన్వీ.. ముంబైలో షూటింగ్..

ఫైటర్ షూటింగ్ ఈ నెల 20 నుండి ముంబైలో మొదలుకానుంది.

news18-telugu
Updated: January 15, 2020, 9:57 AM IST
విజయ్ సరసన జాన్వీ.. ముంబైలో షూటింగ్..
Twitter
  • Share this:
విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి క్రాంతి మాధవ్ దర్శకుడు. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. అది అలా ఉంటే విజయ్  చాలా రోజుల నుంచి మంచి కథతో హిందీ సినిమా చేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. అందులో భాగంగా పూరి జగన్నాధ్,  విజయ్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘ఫైటర్‌’తో విజయ్ హిందీ చిత్ర సీమకు పరిచయం కాబోతున్నాడు. ఈ ఫైటర్‌ను తెలుగు, హిందీతో పాటు అన్ని సౌత్ భాషలలో ఒకేసారి తెరకెక్కించనున్నారు.  ఫైటర్ కథ.. పాన్ ఇండియాకు అప్పీల్ అవుతుందని భావించిన కరణ్ జోహార్, పూరి, ఛార్మిలతో కలిసి ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాడు. ఫైటర్ షూటింగ్ ఈ నెల 20 నుండి ముంబైలో మొదలుకానుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ థాయిలాండ్ లో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్‌లో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా ముంబైలో షూట్ చేయనున్నారు. ముంబైలో ముఖ్యంగా జుహు, తాజ్ హోటల్ లాంటి ఐకానిక్ ఏరియాల్లో షూట్ చేయటానికి ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. ఫైటర్‌లో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ విజయ్ సరసన నటిస్తోంది.

Twitter


జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా...First published: January 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు