Home /News /movies /

VIJAY DEVARAKONDA PURI JAGANNADH ANANYA PANDAY LIGER MOVIE RELEASE DATE AND FIRST GLIMSE RELEASE DATE OFFICIALLY ANNOUNCED TA

Vijay Devarakonda - Liger : విజయ్ దేవరకొండ ‘లైగర్’ రిలీజ్ డేట్ ప్రకటన.. అర్జున్ రెడ్డి సెంటిమెంట్‌తో రంగంలోకి..

విజయ్ దేవరకొండ ‘లైగర్’ రిలీజ్ డేట్ ప్రకటన (Twitter/Photo)

విజయ్ దేవరకొండ ‘లైగర్’ రిలీజ్ డేట్ ప్రకటన (Twitter/Photo)

Vijay Devarakonda - Liger  Movie Release Date | పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ  కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ‘లైగర్’.  బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వాల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించారు.

ఇంకా చదవండి ...
    Vijay Devarakonda - Liger  Movie Release Date | పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ  కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ‘లైగర్’.  బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వాల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గురువు పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే మైక్ టైసన్‌కు సంబంధించిన షూట్ కంప్లీటైంది.  ఈ షెడ్యూల్‌తో ‘లైగర్’ మూవీ క్లైమాక్స్‌ను షూట్ చేయనున్నట్టు సమాచారం.  ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు.  ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది.

    పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్  హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నారు. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి (Sunil Shetty)కనిపిస్తారట. అనన్య పాండే (Ananya Panday)కథానాయికగా నటిస్తోంది.ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. తాజాగా ఈ సినిమాను ఆగష్టు 25న అర్జున్ రెడ్డి రిలీజ్ డేట్ రోజునే రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను డిసెంబర్ 31 అర్ధరాత్రిన ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్టు ట్వీట్ చేశారు.


    ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్రకు బాలయ్య డబ్బింగ్ చెప్పనున్నట్టు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే.. ఈ సినిమాకు అది బోనస్ అనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో బాలయ్య ఎవరు ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ కోవలో ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పినా.. ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. హిందీలో మైక్ టైసన్ పాత్రకు అమితాబ్, మిగతా భాషల్లో కొంచెం క్రేజ్ హీరోలతో మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పించే పనిలో ఉన్నారు.

    Balakrishna - Rajamouli : నాతో సినిమా ఎపుడు చేస్తావ్.. రాజమౌళికి బాలకృష్ణ సూటి ప్రశ్న.. అదిరిన జక్కన్న సమాధానం..

    విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది.హీరోయిన్, ఇతర టెక్నికల్ అంశాలకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న పుష్ప సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. అందులో ‘పుష్ప’ మొదటి భాగం ది రైజింగ్ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ.. ‘పుష్ప’ టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించిన సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Ananya Panday, Balakrishna, Liger Movie, Puri Jagannadh, Tollywood, Vijay Devarakonda

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు