మీకు మాత్రమే చెప్తా అంటున్న సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ..

అవును.. ఇప్పుడు నిజంగానే మీకు మాత్రమే చెప్తా అంటున్నాడు విజయ్ దేవరకొండ. ఈయన హీరోగా ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డియర్ కామ్రేడ్ డిజాస్టర్ అయినా కూడా మనోడు జోరు మాత్రం తగ్గించడం లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 28, 2019, 8:13 PM IST
మీకు మాత్రమే చెప్తా అంటున్న సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ..
విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్ (Source: Twitter)
  • Share this:
అవును.. ఇప్పుడు నిజంగానే మీకు మాత్రమే చెప్తా అంటున్నాడు విజయ్ దేవరకొండ. ఈయన హీరోగా ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డియర్ కామ్రేడ్ డిజాస్టర్ అయినా కూడా మనోడు జోరు మాత్రం తగ్గించడం లేదు. ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు నిర్మాణంలోకి కూడా దిగుతున్నాడు విజయ్. ఇప్పటికే ఈయన నిర్మాణంలో తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్నాడని తెలుసు. ఇప్పుడు దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు విజయ్. దీనికి మీకు మాత్రమే చెప్తా అనే టైటిల్ కూడా పెట్టాడు విజయ్.

తాజాగా విడుదలైన ప్రమోషనల్ వీడియో కూడా అదిరిపోయింది. తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ, అభినవ్ ఇందులో కనిపించారు. టైటిల్ మీకు మాత్రమే చెప్తా అంటూ విజయ్ చేసిన కామెడీ భలేగా ఉంది. కింగ్ ఆఫ్ ది హిల్ అనే ప్రొడక్షన్ హౌజ్ మొదలుపెట్టాడు విజయ్. దీనికి ప్రత్యేకంగా అర్థం కూడా ఏం లేదు. విజయ్ దేవరకొండను ఇంగ్లీష్‌లో పెట్టేసాడంతే. దేవర అంటే కింగ్.. కొండ అంటే హిల్ అలా విజయ్ దేవరకొండ కాస్తా కింగ్ ఆఫ్ ది హిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో తొలి సినిమా కూడా రాబోతుంది. త్వరలోనే పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.

First published: August 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు