Home /News /movies /

VIJAY DEVARAKONDA PRAISES ADIVI SESH MAJOR MOVIE AND SAYS GOOD WORDS ABOUT FILM TA

Major - Vijay Devarakonda : అడివి శేష్ ‘మేజర్’ మూవీ పై విజయ్ దేవరకొండ ప్రశంసల ఝల్లు..

మేజర్ మూవీపై విజయ్ దేవరకొండ ప్రశంసలు ఝల్లు (File/Photo)

మేజర్ మూవీపై విజయ్ దేవరకొండ ప్రశంసలు ఝల్లు (File/Photo)

Major - Vijay Devarakonda : అడివి శేష్ హీరోగా నటిస్తూ కథ, స్క్రీన్ ప్లే అందించిన మూవీ ‘మేజర్’. తాజాగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా... బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాను చూసి హీరోగా విజయ్ దేవరకొండ ప్రశంసల ఝల్లు కురిపించారు.

ఇంకా చదవండి ...
    Adivi Sesh - Major - Vijay Devarakonda | అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తూ నటించిన సినిమా ‘మేజర్’.  ఈ సినిమా జూన్ 3 ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితాన్ని ఎంతో హృద్యంగా తెరకెక్కించారు. మేజర్ మూవీ  అమెరికాలో దాదాపు 600 స్క్రీన్స్‌తో 325 లోకేషన్స్‌లో విడుదలైంది.  ‘మేజర్’ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రూ. 13 కోట్లకు అమ్మారు. ప్రపంచ వ్యాప్తంగా అదనంగా రూ. 5 కోట్లు కలిపి రూ. 18 కోట్లకు అమ్ముడుపోయింది. రూ. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన మేజర్ మూవీ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 21.54 కోట్ల షేర్ ( రూ. 39.50 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. ఓవరాల్‌గా రూ. 2.54 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.

    మేజర్ మూవీ సినిమా చూసి ప్రముఖులు ప్రశంసల ఝల్లు కురిపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ రౌడీగా పేరు పొందిన విజయ్ దేవరకొండ ‘మేజర్’ మూవీని చూసి ఒక ప్యాషన్‌తో.. ప్రేమతో.. ఎంతో హృద్యయంగా ఈ సినిమాను తెరకెక్కించరంటూ మేజర్ మూవీ పై ప్రశంసల ఝల్లు కురిపించారు. అంతేకాదు ఈ సందర్భంగా మేజర్ సందీప్ కృష్ణన్ పాత్రలో అడివి శేష్ అద్భుతంగా నటించడాని మెచ్చుకున్నారు.


    ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విషయంలో అప్పుడే ఓ క్లారిటీ వచ్చింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మేజర్ సినిమా తెలుగుతో పాటు హిందీ, మలయాళం భాషాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో థియేటర్‌‌లోకి వచ్చిన 50 రోజులకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో శోబిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు.



    సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించారు. మేజర్ సినిమా సక్సెస్‌లో  టిక్కెట్ల ధర  (Major ticket prices)  కూడా  మంచి పాత్ర పోషించింది.  తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 150 రూపాయలు, మల్టీ ప్లెక్స్ లో రూ. 195 రూపాయల ధరలను ఫిక్స్ చేశారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్స్‌లో  రూ. 147 రూపాయలు, మల్టీప్లెక్స్ స్క్రీన్ కి, 177 రూపాయలతో ప్రదర్శించబడుతోంది.

    Tollywood Hit Movies 2022 : RRR,KGF2, మేజర్, విక్రమ్ సహా 2022లో హిట్ స్టేటస్ అందుకున్న మూవీస్..

    ఇక ఈ సినిమాలో 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితాన్ని చూపించారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో ఎమోషన్స్‌తో పాటు అదిరే యాక్షన్ సీక్వెన్సెస్‌ను పొందుపరిచారు. ఈ సినిమాలో అడివి శేష్‌తో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ కనిపించారు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా‌తో పాటు GMB ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్ పతాకాలపై సంయుక్తం నిర్మించారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Adivi Sesh, Major Movie, Tollywood, Vijay Devarakonda

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు