హోమ్ /వార్తలు /సినిమా /

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ - పరశురామ్‌లతో దిల్ రాజు మూవీ.. అఫీషియల్ ప్రకటన..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ - పరశురామ్‌లతో దిల్ రాజు మూవీ.. అఫీషియల్ ప్రకటన..

విజయ్ దేవరకొండ, పరశురామ్, దిల్ రాజు కాంబోలో సినిమా ప్రకటన (Twitter/Photo)

విజయ్ దేవరకొండ, పరశురామ్, దిల్ రాజు కాంబోలో సినిమా ప్రకటన (Twitter/Photo)

Vijay Devarakonda - ParasuRam - Dil Raju:  "గీత గోవిందం" తో బ్లాక్ బస్టర్ సాధించిన హీరో విజయ్ దేవరకొండ - పరశురామ్‌లు మరో సినిమా చేయబోతున్నారు. ఈ కొత్త చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ లు ఎస్.వి.సి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Vijay Devarakonda - ParasuRam - Dil Raju:  "గీత గోవిందం" తో బ్లాక్ బస్టర్ సాధించిన హీరో విజయ్ దేవరకొండ - పరశురామ్‌లు మరో సినిమా చేయబోతున్నారు. ఈ కొత్త చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ లు ఎస్.వి.సి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు.సరికొత్త కథతో తెరకెక్కనున్న ఈ చిత్రంతో విజయ్ మొదటి సారి దిల్ రాజు, శిరీష్ ల ఎస్.వి.సి క్రియేషన్స్ బ్యానర్లో పని చేయనుండడంతో చిత్రం పై అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన విషయాలని ఆదివారం  అధికారికంగా ప్రకటించగా ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణుల మరియు ఇతర వివరాలని త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ మూవీ ‘గీతా గోవిందం’ మూవీకి సీక్వెల్ అనే మాట వినబడుతోంది. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే ఓ రెండు షెడ్యూల్స్‌ షూటింగ్ జరుపుకుంది. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది.

విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోందనే ప్రచారం జరగుతోంది. ఒకవేళ నటిస్తే గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత వీళ్ల కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం అవుతోంది.

మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో  ఓ స్పై పోలీస్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ మూవీ పోస్టర్‌లో  అందులో ఓ వ్యక్తి పోలీసు దుస్తుల్లో ముఖానికి ముసుగు ధరించి గూఢచారి ని తలపిస్తున్నాడు. దీంతో ఇదొక స్పై ఫిల్మ్ అని పోస్టర్ ని బట్టి అర్థమవుతోంది. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది.

అది అలా ఉంటే విజయ్ దేవరకొండకు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఓ మలయాళ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో వస్తున్న వృషభలో విజయ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మోహన్‌లాల్ కొడుకుగా విజయ్ కనిపించనున్నారట. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా దర్శకుడు నంద కిషోర్ విజయ్‌తో చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగులో కూడా రూపోందనుందని సమాచారం

First published:

Tags: Dil raju, ParasuRam, Tollywood, Vijay Devarakonda