Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    శివ సార్.. మా అమ్మ నన్ను పనిచేయనీయట్లేదు : విజయ్ దేవరకొండ..

    కరోనా మహమ్మారి లాక్ డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీలో షూటింగ్స్ అన్ని రద్దైయాయి. దీంతో సినీ ప్రముఖులంతా ఇంటికే పరిమితమైపోయారు.

    news18-telugu
    Updated: April 24, 2020, 12:02 PM IST
    శివ సార్.. మా అమ్మ నన్ను పనిచేయనీయట్లేదు : విజయ్ దేవరకొండ..
    ఇదిలా ఉంటే తాజాగా ఈయన మరో సెన్సేషనల్ రికార్డు సొంతం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో విజయ్ ఫాలోయింగ్ చూసి మెంటల్ వచ్చేస్తుంది. ఇక్కడ ఈయన సరికొత్త రికార్డులకు తెర తీస్తున్నాడు. ముఖ్యంగా రౌడీ బాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చరిత్ర సృష్టించాడు.
    • Share this:
    కరోనా మహమ్మారి లాక్ డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీలో షూటింగ్స్ అన్ని రద్దైయాయి. దీంతో సినీ ప్రముఖులంతా ఇంటికే పరిమితమైపోయారు. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా ఇంట్లో పనిమనుషులు రాక పోవడంతో ఇంట్లో ఆడవారికి సాయంగా ఉండాలనీ.. అంతేకాదు ఎవరైతే ఈ కష్టకాలంలో ఆడవారికి తోడుగా ఉంటారో వారే అసలైన మగవారని అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఓ వీడియోను షేర్ చేస్తూ రాజమౌళికి ఛాలెంజ్ విసిరాడు. దీంతో రాజమౌళి తన ఇల్లు శుభ్రం చేయడం.. ఇల్లు కడగడం లాంటీవి చేసి తారక్‌ను చరణ్‌ను నామినేట్ చేశాడు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా తారక్ ఇంటి పనులు చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేయగా తాజాగా చరణ్ కూడా చెట్లకు నీరు పోయడం, బట్టల్నీ వాషింగ్ మిషిన్‌లో వేయడమే కాకుండా తన సతీమణి ఉపాసనకు చక్కగా ఓ కాఫీ కలిపి ఇచ్చాడు. ఈ సందర్భంగా తారక్ కొరటాల శివను నామినేట్ చేయగా.. ఆయన కూడా ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసి విజయ్ దేవరకొండను నామినేట్ చేశాడు. దీనిపై స్పందించిన విజయ్ దేవరకొండ .. ట్విట్టర్ వేదిగా.. శివ సర్‌, మా మమ్మీ నన్ను పని చేయనివ్వట్లేదు. నేను చేస్తే పని డబుల్ అవుతుందని అంటుందని పేర్కొన్నాడు. ఆయన తన పోస్ట్‌లో రాస్తూ.. మమ్మల్ని ఇంట్లో ఇంక పిల్లల్లానే ట్రీట్ చేస్తున్నారు. రియల్ మ్యాన్‌లా చూడట్లేదు. అయినప్పటికీ ఈ లాక్‌డౌన్ సమయంలో నా డే ఎలా గడుస్తుందో తెలియడం కోసం ఓ చిన్న వీడియో షేర్ చేస్తా.. తెలిపాడు. విజయ్ ప్రస్తుతం ఫైటర్ సినిమాలో నటిస్తున్నాడు. పూరిజగన్నాథ్ దర్శకుడు. ఫైటర్ మొదటి షెడ్యూల్ ముంబైలో జరగగా.. రెండవ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగాల్సీవుంది. అయితే కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. కాగా, కొరటాల శివ ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆచార్య తర్వాత కొరటాల విజయ్‌తో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


    Published by: Suresh Rachamalla
    First published: April 24, 2020, 12:02 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading