సినిమాలు వదిలేసిన విజయ్ దేవరకొండ.. వరల్డ్ ఫేమస్ లవర్‌కు కొత్త కష్టాలు..

‘పెళ్లిచూపులు’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. తాజాగా విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాతో పలకరించాడు. ఈసినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో..

news18-telugu
Updated: February 18, 2020, 5:20 PM IST
సినిమాలు వదిలేసిన విజయ్ దేవరకొండ.. వరల్డ్ ఫేమస్ లవర్‌కు కొత్త కష్టాలు..
2018 మార్చి 7న విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేసాడు. తక్కువ వ్యవధిలోనే 9 మిలియన్ల ఫాలోవర్స్‌ని సొంతం చేసుకున్నాడు.
  • Share this:
‘పెళ్లిచూపులు’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’  సినిమాతో పలకరించాడు. క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కే.యస్.రామారావు సమర్పణలో వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రాశిఖన్నా, ఐశ్వర్యా రాజేష్,కేథరిన్, ఇసబెల్ల లైట్ హీరోయిన్స్‌గా నటించారు. విజయ్ దేవరకొండ రేంజ్‌కు సరిపోయేలా ఈ చిత్ర వసూళ్లు మాత్రం రావడం లేదు. ఐతే.. ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో నెగిటివ్ టాక్ రావడంతో రిలీజ్ ముందు వరకు ‘వరల్డ్ ఫేమస్ లవర్’  సినిమా కోసం చెప్పులు అరిగేలా ప్రచారం చేసినా విజయ్ దేవరకొండ ఆ తర్వాత నెగిటివ్ టాక్ బయటకు రావడంతో సైలెంట్ అయిపోయాడు. ఈ చిత్రం చూడమని కనీసం సోషల్ మీడియా వేదికగా చెప్పడం మానేసాడు. ఎక్కడా మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతున్నాడు.

విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ (world famous lover trailer)
విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ (world famous lover trailer)


గతంలో విజయ్ దేవరకొండ అపుడెపుడో రిలీజ్ కాకుండా ఆగిపోయినా.. ‘ఏ మంత్రం వేసావే’ చిత్రం విషయంలో కూడా విజయ్ దేవరకొండ ఇదే చేసాడు. ఇది నా బ్యాక్ లాక్ సినిమా అంటూ తన చిత్రంపై సెటైర్లు వేసుకున్నాడు. ఇక ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా విషయానికొస్తే..  ఈ చిత్రం ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు సీక్వెల్‌లా ఉందనే టాక్ నడిచింది. ముఖ్యంగా రాశి ఖన్నాతో వచ్చే ట్రాక్ అంతా మరోసారి శాలిని, అర్జున్ రెడ్డి ప్రేమకథను గుర్తు చేస్తుంది. ఎంత వద్దనుకున్నా కూడా ఇప్పటికీ అర్జున్ రెడ్డి ప్రభావం విజయ్ దేవరకొండపై కనిపిస్తుంది. ఆయనతో సినిమా అనగానే దర్శకులు కూడా అలాంటి కథలనే ఎక్కువగా రాస్తున్నారనిపిస్తుంది. డియర్ కామ్రేడ్ కూడా అంతే.. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ సైతం అంతే. అందుకే ఇకపై ప్రేమకథలకు దూరంగా ఉంటానని చెప్పాడు విజయ్. అర్జున్ రెడ్డి తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు సైన్ చేసాడు విజయ్. పైగా క్రాంతి మాధవ్ కూడా కథపై ఫోకస్ చేసినా కథనంపై మాత్రం అంతగా దృష్టి పెట్టలేకపోయాడు. మొత్తానికి విజయ్ దేవరకొండ ఇలా తలా తోకా లేని కథలపై కాకుండా.. కంటెంట్ ఉన్న స్టోరీలపై దృష్టి పెడితే బాగుంటుందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: February 18, 2020, 5:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading