VIJAY DEVARAKONDA NO MATTER HOW HARD IT IS FOR THE MOVIE THAT THE GYM IS EMPTY STILL HE IS PRACTICING EVK
Vijay Devarakonda: సినిమా కోసం ఎంత కష్టమైనా రెడీ అంటున్న రౌడీ.. జిమ్ అంతా ఖాళీ.. అయినా తగ్గని లైగర్!
Liger Glimpse Photo : Twitter
Vijay Devarakonda | టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో “లైగర్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం విజయ్ ఎంతో కష్టపడుతున్నాడు.
Vijay Devarakonda : టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో “లైగర్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లైగర్ సినిమా చిత్రీకరణ కరోనా థర్డ్ వేవ్ (Corona Third Wave) కారణంగా
వాయిదా పడ్డ విషయం తెల్సిందే. చిత్ర యూనిట్ సభ్యులను రిస్క్ లో పెట్టడం ఇష్టం లేక షూటింగ్ ను వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాతల్లో ఒక్కరైన ఛార్మి ప్రకటించారు. అయితే ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండా చాలా కష్టపడుతున్నాడు. విజయ్ దేవరకొండ, పూరిల కాంబోలో రూపొందుతున్న లైగర్ సినిమా లో విజయ్ దేవరకొండ బాక్సర్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా లైగర్ కోసం విజయ్ దేవరకొండ చాలా కష్టపడుతున్నాడు.
ఈ సినిమాలో తన లుక్‌పై విజయ్ ఎంతో దృష్టిపెట్టాడు.. లైగర్ కోసం జుట్టు చాలా నెలలుగా పెంచుతూనే ఉన్నాడు. ప్రస్తుతం పొడవాటి జుట్టుతో విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు. ఇక లైగర్ లో బాక్సర్ గా సిక్స్ ప్యాక్ తో కనిపించేందుకు ప్రతి రోజు గంటల కొద్ది జిమ్ చేస్తున్నాడు.
తాజాగా జిమ్ అంతా సెలవుల కారణంగా ఖాళీగా ఉన్నా.. విజయ్ మాత్రం ఫిట్‌నెస్ కోసం కష్టపడుతున్నాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వేదికగా ఫిట్‌నెస్ ట్రెనర్ కులదీప్ సేథీ షేర్ చేసుకొన్నారు. సినిమా మొత్తం హాలీడే లో ఉంది.. అందుకే జిమ్ ఖాళీగా ఉంది. అయితే ఒక్కరు మాత్రం వర్కౌట్స్ కంటిన్యూ చేస్తున్నారు అంటూ విజయ్ దేవరకొండకు సంబంధించిన ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వైరల్ వీడియో కు విజయ్ దేవరకొండ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోపై ఫ్యాన్స్ తెగ పోస్టులు చేస్తున్నారు. సినిమా కోసం ఇంతగా కష్టపడుతారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.