Home /News /movies /

VIJAY DEVARAKONDA MOVIE DEAR COMRADE TEASER RELEASED IN TELUGU NK

బి రెబెల్ అండ్ రొమాంటింగ్... విజయ్ దేవరకొండ... డియర్ కామ్రేడ్ టీజర్ అదిరిందిగా...

 విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ముద్దు సీన్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ముద్దు సీన్

Dear Comrade Teaser : న్యూఇయర్‌లో విజయ్ దేవరకొండ మరో రికార్డుల సెన్సేషన్ సృష్టించేలా కనిపిస్తున్నాడు.

ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న డియర్ కామ్రేడ్ టీజర్ దుమ్ము రేపింది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా... ఫ్యాన్స్ తనలో ఎలాంటి జోష్ కోరుకుంటున్నారో... అదే జోష్‌, అదే సీరియస్ నెస్, అదే రొమాన్స్‌తో అదరగొట్టాడు విజయ్ దేవరకొండ. సీరియస్ యాక్షన్ సీన్ చూపిస్తూనే... మరోవైపు వర్షపు చినుకుల్లో చెలియను ముద్దాడే సీన్‌తో ఫ్యాన్స్ హార్ట్స్ కూల్ చేశాడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకేసారి టీజర్ రిలీజైంది. యూట్యూబ్‌లో జస్ట్ నిమిషాల్లోనే ఈ టీజర్ వేలల్లో వ్యూస్ తెచ్చుకుంది. ప్రేమ కోసం ఫైట్ చేసే యువకుడిగా ఇందులో విజయ్ కనిపించబోతున్నాడు. టీజర్‌ను బట్టీ కాలేజీ రోజుల్లో లవ్ స్టోరీలా కనిపిస్తోంది.


విజయ్‌కి జంటగా రష్మిక మందన్న నటిస్తోంది. భరత్ కమ్మ డైరెక్షన్ చేస్తుండగా... మైత్రీ ఫిల్మ్ మేకర్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మే 31న ఈ సినిమా రిలీజవుతోంది. మొత్తానికి ఈ ఏడాది విజయ్ దేవరకొండ నుంచీ ఓ పవర్‌ఫుల్ రొమాంటిక్ మూవీ వస్తుండటంతో... ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.
First published:

Tags: Rashmika mandanna, Telugu Cinema, Telugu Movie, Telugu Movie News, Tollywood, Tollywood Cinema, Tollywood Movie News, Tollywood news, Vijay Devarakonda

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు