ఏంటి విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకుంటున్నాడా..? అమ్మో ఈ విషయం తెలిసి ఎంతమంది అమ్మాయిల గుండెలు బెలూన్స్లా పేలిపోతాయో కదా.. ఎందుకంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. ఈయన తనకు కాబోయే అమ్మాయి ఎలా ఉండాలో చెప్పాడు. పైగా తనకు ఏ ఊరు అమ్మాయి కావాలో కూడా క్లారిటీ ఇచ్చాడు విజయ్. ‘పెళ్లి చూపులు’తో క్రేజ్ తెచ్చుకున్న ఈయన.. ఇప్పుడు నిజంగానే పెళ్లిపై మనసు విప్పి మాట్లాడాడు.

విజయ్ దేవరకొండ (ఫైల్ ఫోటో)
‘అర్జున్ రెడ్డి’తో అరాచకం చేసిన ఈ కుర్ర హీరో.. ‘గీతగోవిందం’తో కుటుంబ ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. ఇక ‘టాక్సీ వాలా’తో తాను ఎలాంటి సినిమాలో అయినా నటించగలనని.. మెప్పించగలనని నిరూపించాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈ హీరో ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ‘గీతగోవిందం’ తర్వాత మరోసారి రష్మిక మందన్న ఇందులో జోడీ కట్టింది. ఈ చిత్ర షూటింగ్ కాకినాడలో కొన్ని రోజులుగా జరుగుతుంది.

విజయ్ దేవరకొండ (ఫైల్ ఫోటో)
తాజాగా ఈ షెడ్యూల్ పూర్తైంది. సినిమాలో భారీ షెడ్యూల్ ఇక్కడే జరిగింది. వేలాది విధ్యార్థుల మధ్య ఈ షెడ్యూల్ పూర్తి చేసాడు దర్శకుడు భరత్ కమ్మ. ఇక ఇప్పుడు కాకినాడకు బిస్కెట్ వేసే కార్యక్రమంలో బిజీ అయిపోయాడు విజయ్. తనకు కాకినాడ అమ్మాయిని పెళ్లాడాలనుందని చెప్పాడు ఈ హీరో. ‘డియర్ కామ్రేడ్’ అంతా కాకినాడ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమాకు ఇలా ప్రమోషన్ చేసుకుంటున్నాడు విజయ్ దేవరకొండ.

డియర్ కామ్రేడ్ మూవీ స్టిల్స్
తనను తనలా చూసి ఇష్టపడే అమ్మాయి దొరికితే ఇప్పుడే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు విజయ్. మరి ఇంతకీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగితే ఇంకా టైమ్ ఉంది అని చెప్పాడు ఈ కుర్ర హీరో. మొత్తానికి పెళ్లి ముచ్చట్లు అన్నీ చెప్పకనే చెప్పాడు విజయ్ దేవరకొండ. పనిలో పనిగా కాకినాడ పిల్ల కావాలంటూ అక్కడి వాళ్లకు ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు ఈ ‘అర్జున్ రెడ్డి’.
రష్మిక మందన్న హాట్ ఫోటోషూట్..
ఇవి కూడా చదవండి..
Published by:Praveen Kumar Vadla
First published:December 28, 2018, 20:42 IST