అవును.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే జరుగుతుంది ఇప్పుడు. ఈయన పేరు ముంబైలో ఎక్కువగా వినిపిస్తుంది. అక్కడ హీరోయిన్లు కూడా ఈయనకు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటికే జాన్వీకపూర్, కైరా అద్వానీ లాంటి హీరోయిన్లే కాకుండా అర్జున్ కపూర్, వరుణ్ ధావన్ లాంటి హీరోలు కూడా విజయ్ దేవరకొండ నటనకు ఫ్యాన్ అయిపోయారు. ఇక ఇప్పుడు ఈయన సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది బాలీవుడ్. ఇప్పటికే ఈయన నటించిన ‘పెళ్లిచూపులు’ సినిమాను రీమేక్ చేసారు.
ఆ తర్వాత ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ సినిమాను కూడా రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా ఈ చిత్రాన్ని అక్కడ తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ చిత్రం జూన్ 21న విడుదల కానుంది. తెలుగులో సంచలనం సృష్టించిన ఈ చిత్రం హిందీలోనూ చరిత్ర తిరగరాస్తుందని నమ్ముతున్నాడు దర్శకుడు సందీప్. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ నటించిన మరో సినిమా కూడా హిందీలో రీమేక్ కాబోతుంది. గతేడాది 70 కోట్ల వరకు షేర్ వసూలు చేసి సంచలన విజయం సాధించిన ‘గీతగోవిందం’ సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
‘ధడక్’ హీరో ఇషాన్ కట్టర్ ఇందులో నటించబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. షాహిద్ కపూర్౨కు తమ్ముడు అవుతాడు ఈయన. అన్న ‘అర్జున్ రెడ్డి’తో సరిపెట్టుకుంటే.. ఇప్పుడు తమ్ముడు ‘గీతగోవిందం’ కావాలంటున్నాడు. మొత్తానికి విజయ్ దేవరకొండ సినిమా సైన్ చేసాడంటే తెలుగుతో పాటు హిందీ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా చూస్తుందన్నమాట. ఇదే ఊపులో విజయ్ కూడా నేరుగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..?
ప్రియదర్శి మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో ఉన్న ఫోటోస్..
ఇవి కూడా చదవండి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Arjun Reddy, Bollywood, Geetha govindam, Telugu Cinema, Vijay Devarakonda