టాలీవుడ్లో లైగర్ (Liger) రచ్చ అప్పుడే మొదయింది. ఫస్ట్ లుక్ వచ్చిన చోజే విజయ్ దేవరకొండ (Viay Devarakonda) ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదలలయిన విషయం తెలిసిందే. లైగర్ పోస్టర్లో విజయర్ దేవరకొండ లుక్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సాధారణంగా తమ అభిమాన హీరో సినిమా విడుదల అవుతుందంటే.. ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు. పోస్టర్లకు పాలాభిషేకం చేస్తారు. పూలదండలు వేసి కొబ్బరి కాయలు కొడతారు. హీరో ఫొటో నుదుట రక్తపు తిలకం దిద్దుతారు. కానీ విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఫస్ట్ లుక్ విడుదల రోజే రచ్చ రచ్చ చేస్తున్నారు. పాలాభిషేకం కాదు.. ఏకంగా బీరాభిషేకం చేశారు రౌడీ అభిమానులు. లైగర్ పోస్టర్‌కు ఇద్దరు అభిమానులు బీర్‌తో అభిషేకం చేస్తున్న వీడియోను నటి, లైగర్ మూవీ నిర్మాత ఛార్మి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
'రచ్చ మొదలయింది'.. అంటూ ఇన్‌స్టగ్రామ్‌లో వీడియోను పోస్ట్ చేసింది చార్మి. ఈ వీడియోను చూసి విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రౌడీ రచ్చ అంటే మామూలుగా ఉండదు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో ... ఓవర్ ఎక్కువయింది అంటూ తిడుతున్నారు. బీర్‌తో అభిషేకం చేయడమేంటి.. మీ పిచ్చి పీక్స్ చేరిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అతినే కాస్త తగ్గించుకుంటే మంచిందంటూ చివాట్లు పెడుతున్నారు.
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న లైగర్ స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్లో ఉండబోతోంది. ‘ ఫైటర్’ పేరు అనుకున్నారు. కానీ ఈ సినిమా టైటిల్‌తో వేరే సినిమావాళ్లు తీసుకోవడంతో ఈ సినిమాకు ప్యాన్ ఇండియా లెవల్లో ఒక టైటిల్ ఉండేవిధంగా తాజాగా ఈ సినిమాకు ‘లైగర్’ అనే టైటిల్ ఖరారు చేసారు. ది. ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్లు కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. విజయ్‌కు జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ముంబైతో పాటు విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. . పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. . ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. అయితే సునీల్ శెట్టి కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని టాక్.
Published by:Shiva Kumar Addula
First published:January 18, 2021, 14:05 IST