హోమ్ /వార్తలు /సినిమా /

Vijay Devarakonda : విజయ్ లైగర్‌లో అంతర్జాతీయ ఆటగాడు.. ఓ రేంజ్‌లో ప్లాన్ చేసిన పూరి..

Vijay Devarakonda : విజయ్ లైగర్‌లో అంతర్జాతీయ ఆటగాడు.. ఓ రేంజ్‌లో ప్లాన్ చేసిన పూరి..

పైగా గత రెండు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. భారీ అంచనాలతో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్ సినిమాలు దారుణంగా నిరాశ పరిచాయి. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

పైగా గత రెండు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. భారీ అంచనాలతో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్ సినిమాలు దారుణంగా నిరాశ పరిచాయి. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో ప్యాన్ ఇండియా లెవల్‌లో లైగర్ (Liger ) అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో ప్యాన్ ఇండియా లెవల్‌లో లైగర్ (Liger ) అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూరి జగన్నాధ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. కాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ రూమర్ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో ఓ కీలకమైన యాక్షన్ సీన్ లో పాపులర్ ఇంటర్ నేషనల్ బాక్సర్ నటించనున్నారని తెలిసిందే. అందులో భాగంగా అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ను తీసుకున్నారని సమాచారం. ఇక ఇస్మార్ట్ శంకర్ లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో లైగర్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda )లైగర్ సినిమాతో ఈ సారి పాన్ ఇండియా లెవల్లో వస్తున్నాడు. ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి నిర్మిస్తున్నారు. లైగర్ తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. విజయ్‌కు జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే  (Ananya Panday) నటిస్తోంది. ఇక ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన లుక్‌తో పాటు హెయిర్ స్టైల్‌ను కూడా పూర్తిగా మార్చాడు.


లైగర్‌లో విజయ్ ఒక ఫైటర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని పూరి భారీ స్థాయిలో దాదాపు 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 80 శాతం వరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో కీలక పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్  హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తోనట్లు తెలుస్తోంది. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. ఈ సినిమాకు మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 9న దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

First published:

Tags: Tollywood news, Vijay Devarakonda

ఉత్తమ కథలు