Vijay Devarakonda | Liger : మాస్ పాట షూట్‌లో లైగర్ టీమ్.. ఇరగదీస్తోన్న విజయ్ దేవరకొండ.. ఫోటో వైరల్..

Liger Team Photo : Twitter

Vijay Devarakonda | Liger : టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ప్రస్తుతం టీమ్ అక్కడ ఓ మాస్ పాటను షూట్ చేస్తోందట.

  • Share this:
    టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” అనే భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా తర్వాత ఈ చిత్రం షూట్ ఇటీవలే గోవాలో మళ్ళీ స్టార్ట్ అయ్యి అక్కడ కొంత షూటింగ్‌ను జరుపుకుంది. ఇక ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ప్రస్తుతం టీమ్ అక్కడ ఓ మాస్ పాటను షూట్ చేస్తోందట. దీంతో విజయ్ మాస్ గెటప్‌తో ఉన్నటువంటి విజయ్ చేతి ఫోటోను పంచుకున్నారు నిర్మాత ఛార్మి. లైగర్ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రూపోందుతుంది. లైగర్‌ను (Liger) ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది.

    లైగర్‌లో విజయ్‌కు జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే  (Ananya Panday )నటిస్తున్నారు. ఇందులో విజయ్ ఒక ఫైటర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని పూరి భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో కనిపించనున్నారు.

    Arjun | Pushpa : అల్లు అర్జున్ పుష్ప నుంచి మరో మాస్ పాట.. అదిరిన ప్రోమో..

    ఈ సినిమాను 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదల విషయంలో మాత్ర ఇంక క్లారిటీ లేదు.








    View this post on Instagram






    A post shared by Charmmekaur (@charmmekaur)





    ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్  హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తోనట్లు తెలుస్తోంది. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. అయితే సునీల్ శెట్టి కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని టాక్. తెలుగు తమిళ నటి రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

    లైగర్‌లో విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు.

    Tejaswi Madivada : గులాబి రంగు డ్రెస్‌లో పరువాల విందు చేసిన ఐస్ క్రీమ్ పిల్ల తేజస్వీ..

    ఇక విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. హీరోయిన్, ఇతర టెక్నికల్ అంశాలకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న పుష్ప సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత విజయ్‌తో ఉందనుందని తెలుస్తోంది.
    Published by:Suresh Rachamalla
    First published: