Vijay Devarakonda - Liger :డాషింగ్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లెేటెస్ట్ మూవీ ‘లైగర్’. మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ (Myke Tyson)‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే మైక్ టైసన్‌కు సంబంధించిన షూట్ అమెరికాలో కంప్లీట్ అయింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే (Ananya Panday )హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది.పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. లైగర్ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన ఏడు గంటల్లో 8. 49 మిలియన్ వ్యూస్ దక్కించుకుని ఇండియాలోనే తక్కువ సమయంలో అత్యధిక వ్యూస్ పొందిన ఫస్ట్ గ్లింప్స్‌గా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా మరో ఘనత సాధించింది.
తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను ఒడిశాకు చెందిన సైకత శిల్పి.. దశరథ్ మొహంతా ఒడిశా రాష్ట్రంలో చెక్కారు. ఇప్పటికే విడుదలైన విజయ్ దేవరకొండ, మైక్ టైసన్‌ల ఫేస్‌లతో రెడీ చేసిన ఇసుక ఆర్ట్‌కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
#LIGER??? Incredible Sand Art by @DasarathMohanta
After records breaking #LigerFirstGlimpse, movie #VaatLagaaDenge everywhere?@TheDeverakonda @MikeTyson #PuriJagannadh @ananyapandayy @karanjohar @Charmmeofficial @apoorvamehta18 @DharmaMovies @PuriConnects pic.twitter.com/LzrNvfkx2Z
— BA Raju's Team (@baraju_SuperHit) January 24, 2022
‘లైగర్’ మూవీలో హీరో విజయ్ దేవరకొండ.. బాక్సింగ్ ఛాంపియన్ షిప్ కోసం మన దేశం నుంచి అమెరికాకు వెళతారు. అక్కడ అతని ఇంట్రడ్యూస్ చేస్తారు. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ ఫ్యామిలీ కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియర్ అయ్యాడనేదే ఈ సినిమా కథలా కనిపిస్తోంది. హీరోగా విజయ్ దేవరకొండకు దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌కు ఇది తొలి ప్యాన్ ఇండియా మూవీ.
Jayaram Corona Positive : ‘అల వైకుంఠపురములో’ నటుడు జయరామ్‌కు కరోనా పాజిటివ్..
ఈ సినిమా టీజర్లో విజయ్ దేవరకొండను ఊర మాస్ లెవల్లో చూపించారు పూరీ జగన్నాథ్. యాక్షన్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. ఈ సినిమాతో విజయ్‌కు పూరీ జగన్నాథ్ సాలిడ్ హిట్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో సునీల్ శెట్టి (Sunil Shetty) ఈ డాన్ క్యారెక్టర్లో కనిపిస్తారట. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని సమాచారం.
NTR - ANR: అక్కినేని, నందమూరి మధ్య ఉన్న ఈ పోలికలు తెలుసా.. ఎన్టీఆర్ వర్సెస్ ఏఎన్నార్..
ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్రకు బాలయ్య డబ్బింగ్ చెప్పనున్నట్టు సమాచారం. హిందీలో మైక్ టైసన్ పాత్రకు అమితాబ్, మిగతా భాషల్లో కొంచెం క్రేజ్ హీరోలతో మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పించే పనిలో ఉన్నారు. రీసెంట్గా విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ ఇద్దరు బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ షోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మరోవైపు విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. హీరోయిన్, ఇతర టెక్నికల్ అంశాలకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న పుష్ప సినిమాను రెండో పార్ట్ తర్వాత ఈ సినిమా తెరకెక్కనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, Liger Movie, Puri Jagannadh, Tollywood, Vijay Devarakonda