హోమ్ /వార్తలు /సినిమా /

Vijay Devarakonda: లైగర్ రన్ టైమ్‌పై చర్చలు.. ఫస్టాఫ్, సెకండాఫ్ ఇంతేనా..?

Vijay Devarakonda: లైగర్ రన్ టైమ్‌పై చర్చలు.. ఫస్టాఫ్, సెకండాఫ్ ఇంతేనా..?

 Liger Photo twitter

Liger Photo twitter

Liger Movie Runtime: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా పూర్తి చేశారు పూరి జగన్నాధ్. ఈ సినిమాను రేపు అనగా ఆగస్టు 25న రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రన్ టైమ్ గురించిన చర్చలు నడుస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

పూరి జగన్నాథ్ (Puri Jagannadh) మాస్ ట్రాక్ లో రాబోతున్న కొత్త సినిమా లైగర్ (Liger). తనదైన పంధాలో సినిమాలు తెరకెక్కించే ఈ డాషింగ్ డైరెక్టర్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తన మాస్ యాంగిల్‌కి మరింత పదును పెట్టి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే బాటలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో (Vijay Devarakonda) లైగర్ సినిమా చేస్తున్నారు.ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, వీడియోస్ ఈ సినిమాలో రొమాంటిక్ డోస్ ఏ రేంజ్ లో ఉండనుందో స్పష్టం చేశాయి. ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా రన్ టైమ్ గురించి ఓ అప్‌డేట్ వైరల్ అవుతోంది.


లైగర్ సినిమా రన్ టైమ్‌ను చాలా తక్కువ అనే సమాచారం వైరల్ గా మారింది. మొత్తం 140 నిమిషాల రన్ టైమ్ ఫిక్స్ చేశారట మేకర్స్. అంటే దాదాపు రెండు గంటల 20 నిమిషాలే. అందులో ఫస్టాఫ్ 1గంట 15 కాగా, సెకండాఫ్ 1గంట 05 నిమిషాలుగా ఉందని అంటున్నారు. ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి పాజిటివ్ బజ్ నెలకొనడంతో అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది.


ధర్మ ప్రొడక్షన్, పూరి కనెక్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మించాయి. సాలా క్రాస్ బ్రీడ్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కించిన ఈ సినిమా చూసి సెన్సార్ సభ్యులు ఫిదా అయ్యారట. ఈ సినిమాకు UA సర్టిఫికెట్ జారీ చేశారు సెన్సార్ బోర్డు సభ్యులు. ముంబై బ్యాక్ డ్రాప్ ఎంచుకొని బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో చాలా డిఫరెంట్ సీన్స్ షూట్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.


కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిన ఈ సినిమాను అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీపై బోలెడన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి. కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కావడం విశేషం. సో చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ సాధిస్తుందనేది.


Published by:Sunil Boddula
First published:

Tags: Liger, Puri Jagannadh, Vijay Devarakonda

ఉత్తమ కథలు