విజయ్ దేవరకొండ ‘లైగర్’లో మైక్ టైసన్ (Twitter/Photo)
Vijay Devarakonda - Liger : విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.
Vijay Devarakonda - Liger : విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌లో నట సింహా బాలకృష్ణ కూడా సడెన్ విజిత్ చేసిన చిత్ర యూనిట్‌ను సర్‌ఫ్రైజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో మాస్టర్ ఆఫ్ రింగ్‌గా పేరు గాంచిన మైక్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. అందుకే కథ రీత్యా ఈ సినిమాలో మైక్ టైసన్ ఓ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మైక్ టైసన్.. విజయ్ దేవరకొండ గురువు పాత్రలో కనిపించబోతున్నారా.. లేకపోతే.. ఆయనతో ఫైట్ చేసే విలన్‌గా యాక్ట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మైక్ టైసన్ రాకతో ‘లైగర్’ మూవీపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.
‘వరల్డ్ ఫేమస్ లవర్’ డిజాస్టర్ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్షన్‌లో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను ఛార్మి(Charmee), కరణ్ జోహార్ (Karan Johar)లు కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషల్లో మాత్రమే కాకుండా భారత్‌లోని ప్రధాన భాషల్లో ఈ సినిమా విడుదల చేయనున్నారు. లైగర్ అంటే సింహం, పులికి పుట్టిన జంతువును లైగర్ అని పిలుస్తారు. తెలుగు, హిందీతో పాటు మిగతా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది.
‘లైగర్’ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నారు. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. విజయ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓసినిమా చేయనున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది.
హీరోయిన్, ఇతర టెక్నికల్ అంశాలకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న పుష్ప సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.