లైగర్.. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు ఇది. అసలు లైగర్ అంటే ఏంటి.. అంటూ చాలా మంది గూగుల్ చేస్తున్నారిప్పుడు. ఫైటర్ అనుకున్న సినిమాకు ఉన్నట్లుండి లైగర్ అనే టైటిల్ విడుదల చేసాడు పూరీ జగన్నాథ్. విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. పాన్ ఇండియన్ స్థాయిలో వస్తున్న లైగర్ సినిమా కోసం అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. పైగా ఇప్పుడు ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే లైగర్ అనే టైటిల్ చాలా విచిత్రంగా ఉంది. ఫైటర్ విన్నాం.. టైగర్ విన్నాం కానీ లైగర్ అనే పదం మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది. ముందు నుంచి కూడా ఇదే టైటిల్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఇప్పుడు అదే టైటిల్ విడుదల చేసాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. సాలా క్రాస్ బ్రీడ్ అంటూ కింద ట్యాగ్ లైన్ కూడా పెట్టాడు పూరీ జగన్నాథ్. బాక్సింగ్ గ్లౌజ్‌లతో పిచ్చెక్కిస్తున్నాడు విజయ్. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా కచ్చితంగా సంచలనం రేపేలా కనిపిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత కమ్ డిస్ట్రబ్యూటర్ కరణ్ జోహార్ హిందీలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్‌లో పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఉత్తరాది భామ అనన్య పాండే ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతుంది.
లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు పూరీ. ఇదిలా ఉంటే లైగర్ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు. దీనికి అర్థం ఉంది.. మగ సింహం, ఆడ పులికి పుట్టిన సంతానాన్ని లైగర్ అంటారు. లయన్‌లోని ల అనే పదాన్ని.. టైగర్‌లోని చివరి రెండు అక్షరాలను తీసుకుని లైగర్ అంటారు. ఇప్పుడు విజయ్ సినిమాకు ఇదే పేరును ఖరారు చేసారు. అందుకే అనుమానం లేకుండా 'సాలా క్రాస్ బ్రీడ్' అనే ట్యాగ్‌లైన్ కూడా ఇచ్చాడు పూరీ జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telugu Cinema, Tollywood, Vijay Devarakonda, Vijay devarakonda liger