హోమ్ /వార్తలు /సినిమా /

Vijay Devarakonda Liger : జులైలో లైగర్ రిలీజ్ డేట్‌ను లాక్ చేసిన పూరి జగన్నాథ్..

Vijay Devarakonda Liger : జులైలో లైగర్ రిలీజ్ డేట్‌ను లాక్ చేసిన పూరి జగన్నాథ్..

అల్లు అర్జున్ కంటే వేగంగా 13 మిలియన్ ఫాలోవర్స్‌ అందుకున్నాడు. అయితే ముందు ఈ మార్క్ అందుకున్నది మాత్రం అల్లు అర్జునే. ఆయన తర్వాత మూడు రోజులకే విజయ్ కూడా 13 మిలియన్ క్లబ్బులోకి ఎంట్రీ ఇచ్చాడు. తనకు ఈ స్థాయిలో సపోర్ట్ చేస్తున్న అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపాడు విజయ్ దేవరకొండ.

అల్లు అర్జున్ కంటే వేగంగా 13 మిలియన్ ఫాలోవర్స్‌ అందుకున్నాడు. అయితే ముందు ఈ మార్క్ అందుకున్నది మాత్రం అల్లు అర్జునే. ఆయన తర్వాత మూడు రోజులకే విజయ్ కూడా 13 మిలియన్ క్లబ్బులోకి ఎంట్రీ ఇచ్చాడు. తనకు ఈ స్థాయిలో సపోర్ట్ చేస్తున్న అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపాడు విజయ్ దేవరకొండ.

Vijay Devarakonda Liger : రౌడీ హీరో విజయ్ దేవరకొండ మొన్నటి వరకు సమ్మర్‌లో సత్తా చూపిస్తాడు అనుకున్నారు ఫ్యాన్స్.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ మొన్నటి వరకు సమ్మర్‌లో సత్తా చూపిస్తాడు అనుకున్నారు ఆయన ఫ్యాన్స్. అయితే తాజా సమాచారం మేరకు ఈ సమ్మర్ బరిలో విజయ్ దేవరకొండ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ.. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' అనే ఓ ప్యాన్ ఇండియన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సమ్మర్ లో విడుదల చేయాలని మేకర్స్ మొదట అనుకున్నారు దర్శకనిర్మాతలు. అయితే దీనికి ఓ కారణం కరోనా వల్ల షూటింగ్ పూర్తికాకపోవడం.. కాగ మరో కారణం ఇప్పటికే వేరే సినిమాలు విడుదల తేదీలు లాక్ చేసుకోవడం. ఈ రెండు ఈ కారణాలతో 'లైగర్' సినిమా సమ్మర్ రేసు నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఇక తాజా సమాచారం మేరకు ఈ లైగర్‌ను జులైలో ప్యాన్ ఇండియా విడుదల చేయాలనీ చూస్తున్నారట.

ఇస్మార్ట్ శంకర్ లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి నిర్మిస్తున్నారు. లైగర్ తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య పాండే నటిస్తోంది. ఇందులో విజయ్ ఒక ఫైటర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని పూరి భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు.

ఇక తాజా సమాచారం మేరకు ఈ సినిమాను 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను త్వరలోనే షూటింగ్‌ను పున: ప్రారంభించనుంది చిత్రబృందం.ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో భాగంగా ఇప్పటికే ముంబైలో 40 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకుంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్  హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తోనట్లు తెలుస్తోంది. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. అయితే సునీల్ శెట్టి కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని టాక్. తెలుగు తమిళ నటి రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక ఈ చిత్రం షూటింగును త్వరలోనే విదేశాలలో జరుపనున్నారని సమాచారం. ఈ సినిమా దర్శకుడు పూరి తన ఫేవరైట్ కంట్రీ బ్యాంకాక్ లో ఈ సినిమా షూటింగ్’ను నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాడట. దాని కంటే ముందు.. హైదరాబాద్ లో నిర్మించిన ఓ సెట్‌లో ఈ సినిమా షూటింగ్ రిస్టార్ట్ కానుందని తెలుస్తోంది.

View this post on Instagram


A post shared by Ananya ?? (@ananyapanday)View this post on Instagram


A post shared by Ananya ?? (@ananyapanday)ఫైటర్‌ కోసం ప్రత్యేకంగా వేసిన బాక్సింగ్ సెట్ లో విజయ్ దేవరకొండ పై కొన్ని ఫైట్ సీన్ షూట్ చేస్తారట. అయితే కరోనా కారణంగా ఏర్పడ్డ ఈ గ్యాప్’ను పూర్తి చేయడానికి పూరి ఇక ఏకధాటిగా షూటింగ్‌ను నిర్వహించనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. మెలోడి కింగ్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు.

First published:

Tags: Tollywood news, Vijay Devarakonda

ఉత్తమ కథలు