Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఖాతాలో మరో రికార్డు నమోదు అయింది. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగారు విజయ్ దేవరకొండ. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చి అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలతో తన మార్కెట్ పరిధి పెంచుకున్నారు. ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలు చేసే స్థాయికి ఎదిగారు. త్వరలో ఫైటర్‌గా అభిమానులను పలకరించనున్నారు విజయ్ దేవరకొండ. రీసెంట్గా విజయ్ దేవరకొండ.. హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్‌గా నంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఆల్ ఇండియా లెవల్లో నెంబర్ 2 ప్లేస్‌లో నిలిచారు. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్స్ కు పైగా ఫాలోవర్స్‌తో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉన్నారు. తాజాగా విజయ్ దేవరకొండ ఖాతాలో మరో అరుదైన ఘనత సాధించారు.
ప్రముఖ సామాజిక మాధ్యమైన ఫేస్బుక్లో 10 మిలియన్ ఫాలోవర్స్ ఫేస్బుక్లో ఉన్నారు. తెలుగులో ఈ ఫీట్ అందుకున్న అతి కొద్ది మంది నటుల్లో విజయ్ దేవరకొండ ఒకరు.
.@TheDeverakonda Crossed 1️⃣0️⃣ Million Followers On Facebook
— BARaju's Team (@baraju_SuperHit) July 20, 2021
#10MRowdiesOnFB #VijayDeverakonda || #Liger pic.twitter.com/ErV2fcVGqI
ఇక విజయ్ నటిస్తున్న ప్రస్తుత చిత్రం లైగర్ విషయానికి వస్తే.. ఇందులో విజయ్ ఒక ఫైటర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని పూరి భారీ స్థాయిలో దాదాపు 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 80 శాతం వరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా మళ్లీ మొదలైంది. ఈ సినిమాలో కీలక పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. ఈ చిత్రంలో మరోఇంపార్టెంట్ రోల్లో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తోనట్లు తెలుస్తోంది. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. అయితే సునీల్ శెట్టి కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని టాక్. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 9న దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కానున్నట్టు ప్రటించినా.. ఇపుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా విడుదల అనేది కష్టమే అని చెప్పొచ్చు. ఇక విజయ్ మరో హిందీ సినిమాకు సై అన్నట్లు టాక్ నడుస్తోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని తెలిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, Liger, Tollywood, Vijay Devarakonda