Home /News /movies /

VIJAY DEVARAKONDA LIGER AAFAT VIDEO TEASER RELEASED SLB

Liger Aafat Video Teaser: విజయ్ దేవరకొండకు అనన్య స్వీట్ కిస్

@Vijay Devarakonda Photo/ Twitter

@Vijay Devarakonda Photo/ Twitter

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay devarakonda) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ (Liger). తాజాగా ఈ సినిమా నుంచి ఆఫట్ వీడియో టీజర్ రిలీజ్ చేశారు.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay devarakonda) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ (Liger). ఈ సినిమాలో విజయ్ దేవరకొండ జంటగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ చేస్తూనే ఈ సినిమా నుంచి వదులుతున్న ఒక్కో అప్ డేట్ సినిమాపై హైప్ పెంచేస్తోంది. విజయ్ దేవరకొండ- పూరి కాంబో కావడంతో ప్రతి ఒక్కరి చూపు ఈ సినిమాపైనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ వదిలి అట్రాక్ట్ చేశారు మేకర్స్.

ఆఫట్ వీడియో టీజర్ అంటూ కేవలం 39 సెకనుల వీడియో రిలీజ్ చేసి ఈ పాటపై క్రేజ్ పెంచేశారు. ఫుల్ వీడియోను రేపు అనగా ఆగస్టు 5న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వీడియోలో విజయ్ దేవరకొండకు అనన్య స్వీట్ కిస్ హైలైట్ అయింది. విజయ్- అనన్య మధ్య రొమాంటిక్ మూమెంట్స్ ఫుల్ సాంగ్ పట్ల ఆసక్తి పెంచేశాయి. ఈ మేరకు విడుదల చేసిన కొత్త పోస్టర్ కూడా నెట్టింట వైరల్ గా మారింది.

విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీపై బోలెడన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి. అల్ట్రా స్టైలిష్‌ లుక్‌లో విజయ్‌ని చూసి ఫిదా అవుతున్నారు ఆయన ఫ్యాన్స్. పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ మూవీని ఎంతో గ్రాండ్‌గా ఆగస్టు 25న ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. లైగర్ (Liger) కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కావడం విశేషం.

ఇకపోతే రీసెంట్‌గా విడుదల చేసిన విజయ్ దేవరకొండ సెమీ న్యూడ్ పోస్టర్ వైరల్‌గా మారడమే గాక జనాల్లో డిస్కషన్ పాయింట్ అయింది. పలువురు హీరోయిన్స్ కూడా ఈ పోస్టర్ చూసి తమ తమ ఫీలింగ్స్ బయటపెట్టారు. మొత్తానికైతే లైగర్ ప్రమోషన్స్‌లో పూరి మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సినిమాలో యూత్ ఆడియన్స్‌ని పిచ్చెక్కించే ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని తెలుస్తుండటం సినిమా పట్ల ఉన్న ఆతృతను రెట్టింపు చేస్తోంది.
Published by:Sunil Boddula
First published:

Tags: Ananya pandey, Liger Movie, Vijay Devarakonda

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు